BigTV English

Siddu Jonnalagadda: పాప్ కార్న్ అమ్ముకోవడానికి తెలుగులో ఈ పంచాయతీ, సిద్దు సంచలన వ్యాఖ్యలు

Siddu Jonnalagadda: పాప్ కార్న్ అమ్ముకోవడానికి తెలుగులో ఈ పంచాయతీ, సిద్దు సంచలన వ్యాఖ్యలు
Advertisement

Siddu Jonnalagadda: ముందుగా కొన్ని కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన సిద్దు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తరువాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకోవడంతో సిద్దుకి కొంతమేరకు ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. సిద్ధూలో స్వతహాగా రైటర్ ఉండడం కూడా తనకు మంచి ప్లస్ గా మారింది.


సిద్దు ఎన్ని సినిమాలు చేసినా కూడా అతని పేరు చెప్పగానే మొదటి గుర్తు వచ్చే సినిమా డీజే టిల్లు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సమైన సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. కేవలం అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా సిద్దుకి ఈ సినిమా ఒక బ్రాండ్ గా మారింది. బయట కూడా చాలామంది సిద్ధుని టిల్లు అనడం ఈ సినిమా తర్వాతే మొదలుపెట్టారు. అలానే టిల్లు స్క్వేర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

పాప్కార్న్ పంచాయతీ 

సిద్దు జొన్నలగడ్డ నీరజకోన దర్శకత్వంలో తెలుసు కదా అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. కానీ కమర్షియల్ గా ఈ సినిమాకు రావలసిన పేరు మాత్రం రాలేదు అనేది వాస్తవం. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ఎవరూ ప్రస్తావించడం లేదు.


ఈ తరుణంలో సిద్దు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కొంతమంది సినిమా చూసి ఫస్ట్ ఆఫ్ బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది సెకండాఫ్ బాగుంది అంటున్నారు. దీనిని బట్టి సినిమా ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ రెండు బాగున్నాయి. కానీ సినిమా బాలేదు అని ఎవరు అనడం లేదు.

సినిమాని పూర్తిగా చూస్తేనే అది మనకు అర్థమవుతుంది. హాలీవుడ్ సినిమాలలో ఇంటర్వెల్ ఉండదు. తెలుగు సినిమాల్లో పాప్ కార్న్ అమ్ముకోవడం కోసం ఈ ఇంటర్విల్ అనే పంచాయతీని తీసుకువచ్చారు.

అలా చూస్తేనే కిక్ 

సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా ఆసక్తికరంగా మలిచి ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ ముందు మంచి హై ఇస్తారు. ఆ హై తో ఉన్న ఆడియన్స్ ఇంటర్వెల్ కి కాసేపు రెస్ట్ తీసుకోవడం వలన అది మొత్తం దిగిపోతుంది. మళ్లీ మనం ఆడియన్స్ ని ఆ ఫీల్ లోకి తీసుకురావడానికి టైం పడుతుంది. అందుకే చాలా సినిమాలు విషయంలో కంప్లైంట్ వస్తుంది. ప్రతి సినిమాలోని సెకండ్ హాఫ్ లో డిప్ అనేది ఉండటం కామన్ గా జరుగుతుంది. అని సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Also Read: Devara 2 : నార్త్ మార్కెట్ పై దృష్టి పెట్టిన కొరటాల, దేవర 2 సినిమాలో భారీ మార్పులు

Related News

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Bandla Ganesh: చిరంజీవి కోసమే సింహాసనం.. మనస్సు ఉప్పొంగిపోయిందన్న బండ్లన్న!

Raviteja: రవితేజకు మాస్ మహారాజ్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?ఆ డైరెక్టర్ వల్లేనా?

Big Stories

×