BigTV English

Mirai New Release Date: మళ్లీ వాయిదా పడ్డ మిరాయ్‌, ట్రైలర్‌ అప్‌డేట్‌తో షాకిచ్చిన మూవీ టీం!

Mirai New Release Date: మళ్లీ వాయిదా పడ్డ మిరాయ్‌, ట్రైలర్‌ అప్‌డేట్‌తో షాకిచ్చిన మూవీ టీం!

Mirai Movie Again Postponed: కుర్రహీరో తేజ సజ్జా ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌తో సూపర్‌ హీరో అయ్యాడు. పాన్‌ ఇండియా స్థాయిలో 2024లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. రికార్డు వసూళ్లతో బాక్సాఫీసును షేక్‌ చేసింది. ఈ చిత్రంతో తేజ సజ్జా పేరు మారుమ్రోగింది. హనుమాన్‌ తర్వాత అతడు నటిస్తున్న మరో సూపర్‌ హీరో మూవీ ‘మిరాయ్‌’. రవితేజ ‘ఈగల్‌’ ఫేం కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 5న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్‌లో రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుంది. దీంతో తేజ సజ్జా ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు.


మిరాయ్ మళ్లీ వాయిదా

అయితే ఇప్పుడు మిరాయ్‌ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు మూవీ టీం కొత్త పోస్టర్‌ రిలీజ్ చేస్తూ మూవీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో కూడా చెప్పేసింది. హనుమాన్‌ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్‌ మూవీగా మిరాయ్‌ని కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా సూపర్‌ హీరో జానర్‌ టచ్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, పాటలు మూవీ మంచి హైప్ పెంచాయి. ముఖ్యంగా వైబ్‌ ఉంది బేబీ పాట ఎంతగా హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ సాంగ్ ట్రెండ్‌ అవుతోంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్‌కి ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వస్తోంది. టీజర్‌ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది.


కొత్త రిలీజ్ డేట్ ఇదే!

దీంతో మూవీ రిలీజ్ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సెప్టెంబర్‌ 5న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఇప్పుడు మరోసారి మిరాయ్‌ మూవీ వాయిదా వేస్తూ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా తేజ సజ్జా, మంచు విష్ణుతో ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఆగష్టు 28న ట్రైలర్‌ రిలీజ్ చేస్తున్న ఆఫీషియల్‌గా ప్రకటించారు. అలాగే మిరాయ్‌ కొత్త రిలీజ్‌ని సెప్టెంబర్‌ 12న ఫిక్స్‌ చేశారు. సెప్టెంబర్‌ 5న అనుష్క ఘాటీ మూవీ రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిరాయ్‌ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. గతేడాది డిసెంబర్‌లోనే మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ, వరుసగా కన్నప్ప, గేమ్‌ ఛేంజర్‌, హరి హర వీరమల్లు వంటి పెద్ద సినిమాలు రిలీజ్ ఉండటంతో మిరాయ్‌ మూవీ తరుచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సెప్టెంబర్‌ 5న రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడటంతో మూవీ లవర్స్‌ డిసప్పాయింట్‌ అవుతున్నారు. ఈ సారి ఎక్కువ ల్యాగ్‌ లేకుండ వారం రోజులు మాత్రమే వెనక్కి వెళ్లడంతో ఫ్యాన్స్‌ ఫర్వాలేదు అంటున్నారు. కాగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ మూవీ హిందీ రైట్స్‌ని ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ దక్కించుకున్నారు. తన సొంత బ్యానర్‌ ధర్మ ప్రొడక్షన్‌లో మూవీని విడుదల చేస్తుండటం విశేషం.

Related News

Jasmine Jaffar Controversy: ఆలయంలో బిగ్‌బాస్‌ భామ ఇన్‌స్టా రీల్‌.. ఆరు రోజుల ఆలయ శుద్ధి పూజకు ఆదేశం!

Karthi: ఆ పని మాత్రం అస్సలు చేయను… రజనీకాంత్ సలహా ఇప్పటికి పాటిస్తా: కార్తీ

Mass Jathara: అనుకున్నదే అయ్యింది.. మాస్ మహారాజా కూడా వెనక్కి తగ్గాడు

Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

The Girlfriend: రష్మిక – దీక్షిత్ మధ్య ‘ఏం జరుగుతోంది.’. ?

Big Stories

×