Ram Charan: ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అది అవతల వాళ్ళకి వేరేలా అనిపించొచ్చు. కానీ పర్సనల్ గా వాళ్లకు మాత్రం అవి కొంతమేరకు ప్రత్యేకం అని చెప్పాలి. చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్. చరణ్ చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. చిరంజీవి కొడుకుగా తనపైన పెట్టుకున్న ప్రేక్షకులు అంచనాలను సక్సెస్ఫుల్గా నిలబెట్టాడు చరణ్.
ఇక రెండవ సినిమాతో ఏకంగా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు. ఇప్పటికీ మగధీర సినిమా మంచి హై ఇస్తుంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ సినిమాలేవి కూడా రామ్ చరణ్ కెరీర్ కు పడలేదు. కేవలం రామ్ చరణ్ కు మాత్రమే కాదు. రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసిన ఆ తర్వాత సినిమాలు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. అది యాదృచ్ఛికమో ఇంకేంటో తెలియదు కానీ జరగటం మాత్రం జరుగుతుంది.
రామ్ చరణ్ కు మార్చి నెల బాగా సెంటిమెంట్. ఆ మంత్ లో చరణ్ చేసిన సినిమాలు విడుదలయితే అవి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలబడతాయి. అదే నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఉంది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు అని ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా మార్చి నెలలోనే విడుదలైంది. ఆ సినిమా చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసుకొచ్చింది. అలానే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా మార్చి నెలలోనే విడుదలైంది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ కు గుర్తింపు వచ్చేలా చేసింది.
ఆ రెండు సినిమాలు గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి కాబట్టి పెద్ది సినిమాను కూడా మార్చి నెలలోనే ప్లాన్ చేశారా అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ఇకపోతే పెద్ది సినిమాను మొదట మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బుచ్చిబాబు పెద్ది సినిమాను 26నే రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపాడు. 26న రిలీజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ముందు రోజు ప్రీమియర్ షోస్ ఉండే అవకాశం ఉంది. బుచ్చిబాబు చెప్పిన విధంగా అన్ని వర్కౌట్ అయితే మార్చి 25న పెద్ది సినిమా చూడొచ్చు. గతంలో అదే రోజున త్రిపుల్ ఆర్ సినిమా విడుదలైంది.
Also Read: Mass Jathara : అర్థం పర్థం లేని పాటను రిలీజ్ చేసిన మాస్ జాతర యూనిట్