Ram Said I Feel Bad About Charan: హీరో రామ్ పోతినేని ఈ మధ్య మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. ప్రమోషన్స్ లోనూ పెద్దగా కనిపించడం లేదు. షూటింగ్స్ కూడా సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. ఒకప్పుడు మూవీ ఈవెంట్స్, ఇంటర్య్వూలతో తరచూ మీడియా, సోషల్ మీడియాలో నిలిచే రామ్, ఈ మధ్య చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలుకా చిత్రంతో బిజీగా ఉన్న రామ్ పోతినేని.. ఇటీవల జగపతి బాబు టాక్ షోలో పాల్గొన్నాడు. ‘జయమ్ము నిశ్చయమ్మురా‘ షో ద్వారా జగపతి బాబు సెలబ్రిటీలతో చిట్ చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన విషయాలను, విశేషాలను షేర్ చేస్తున్నాడు.
అలాగే రామ్ పోతినేని తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఈ షో వేదికగా షేర్ చేసుకున్నాడు. సినీ పరిశ్రమ బయట నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుందన, ఇదోక రంగుల ప్రపంచమని చాలా మంది అభిప్రాయపడతారు. కానీ, ఈ ప్రపంచం వెనుక ఉండే ఒత్తిడి, కష్టాలు సమస్యలు ఎలా ఉంటాయో అందరికి తెలియదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కి ఇదోక పెద్ద సవాలు. వారికి ఉండే ఒత్తిడి మరెవరికి ఉండదు అన్నాడు. నా మొదటి సినిమా దేవదాసు బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీ సక్సెస్ తర్వాత చిరంజీవి గారు నన్ను పిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండ వచ్చిన నాకు కొన్ని విషయాలను చెప్పారు.
అవి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అవి నా కెరీర్ ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాడు. అప్పటి వరకు చిరంజీవి గారి లాంటి తండ్రి నాకు కూడా ఉండుంటే బాగుండు. ఇండస్ట్రీలో ఓ బిగ్ స్టార్, స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చేవాడిని, నాకు పెద్ద ప్లాట్ ఫాం దొరకేది అని అనుకునేవాడిని. కానీ, చరణ్ ని చూశాక నా అభిప్రాయం మొత్తం మారిపోయిందన్నాడు. ’నువ్వు స్టార్ కిడ్ కాకపోయిన తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టావు. నువ్వు చాలా లక్కీ. తొలి మూవీ హిట్ కే పొంగిపోకు. సక్సెస్ వచ్చిందని సడలిపోవద్దు. ప్రతి సినిమాను మొదటి సినిమాలా ఫీలవ్వాలి. నిరూపించుకోవాలి’ అని చిరంజీవి తనకు సలహా ఇచ్చారని చెప్పాడు.
అయితే అప్పటికీ ఆయన కొడుకు రామ్ చరణ్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలోనే చిరంజీవి గారు తన చరణ్ కి ఎంత ఒత్తిడి ఉంటుందో ముందే అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న. చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ, చరణ్ లో మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించాడు. స్టార్ కిడ్ ఉండే ఒత్తిడి అప్పుడే చరణ్ మొహంలో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఆయన వారసత్వం వల్ల అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు భరించడం చాలా కష్టం. అప్పుడే చరణ్ లో ఆ ప్రెషర్ స్పష్టంగా కనిపించేది. అప్పుడు చరణ్‌ని చూస్తే నిజంగా జాలేసింది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.
Also Read: Actor Shivaji: సుధీర్ విలన్ గా శివాజీ.. మంగపతిని మించిన పాత్ర ఇది, ఇక వెండితెరపై రచ్చే