Mari Selvaraj: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు చూసే విధానం, సినిమాలు తీసే విధానం రెండు కూడా మారిపోయాయి. ఒకప్పుడు సినిమాలో మంచి కథ ఉంటే చాలామంది హీరోలు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు కథకంటే ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక మామూలు కథకు విపరీతమైన వినోదాన్ని జోడిస్తే అదే బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. దీని గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి.
తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఒకే రకమైన సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఆ సినిమాలు కమర్షియల్ గా ఎంత సక్సెస్ సాధిస్తాయి అనే విషయాన్ని పక్కన పెడితే. కొంతమంది ఆ సినిమాలను చూడడానికి విపరీతంగా ఇష్టపడతారు. వెట్రి మారన్, రంజిత్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు తీసే సినిమాలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. అణగారిన వర్గాలకు ఆదరణగా ఆ సినిమాలు అనిపిస్తుంటాయి.
కేవలం వాళ్ళ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో వాళ్లు ఇచ్చే స్పీచెస్ కూడా ఆలోచించే విధంగా ఉంటాయి. మారి సెల్వరాజ్ ధ్రువ విక్రమ్ హీరోగా బైసన్ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే, ఈ సినిమాకు కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ప్రశంసలు కూడా వస్తున్నాయి.
ఈ సినిమా అక్టోబర్ 17న తమిళనాడులో రిలీజ్ అయింది. తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు. అక్టోబర్ 24న విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించారు.
అయితే తమిళనాడులో ఈ చిత్ర యూనిట్ కొన్ని థియేటర్స్ ను సందర్శిస్తున్నారు. ఒక థియేటర్లో ఆడియన్స్ను ఉద్దేశిస్తూ మారి సెల్వరాజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మారి మాట్లాడుతూ నేను నీకు మద్యాన్ని ఇవ్వడం లేదు. నేను ఒక మంచి పుస్తకాన్ని ఇస్తున్నాను. నా సినిమాని నువ్వు ఒక పుస్తకంలా చూడు అంటూ చెప్పారు. ఈ మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.
మరోవైపు సినిమాకు ప్రశంసలు ఎలా అయితే వస్తున్నాయో, అలానే సినిమాను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక జోనర్లో సినిమా చేయలేరా? ఎప్పుడూ అనగారిన వర్గాలు ను పట్టుకొని సినిమాలు తీయడమే కొంతమంది దర్శకులు పనా అని ట్విట్టర్ వేదికగా ఇంకొంతమంది కామెంట్ చేయడం మొదలు పెడుతున్నారు.
ఈ మాటలు కూడా కొంతమంది తెలుగు సినిమాలను కామెంట్ చేస్తూ ఆది పురుష్, హనుమాన్, మిరాయి, కార్తికేయ వంటి సినిమాలను తీస్తుంటారు. అర్జున్ రెడ్డి, వీర సింహారెడ్డి, సమరసింహారెడ్డి వంటి సినిమాలను తెలుగు దర్శకులు తీస్తూనే ఉంటారు అని రివర్స్ ఆర్గ్యుమెంట్ మొదలు పెడుతున్నారు కొంతమంది తమిళ ప్రేక్షకులు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ సెంటిమెంట్ మంత్, పెద్ది రిలీజ్ డేట్ కూడా కారణం అదేనా?