Mass Jathara : కొందరు హీరోలు కొన్ని చేయడాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడతారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. అలానే కాన్సెప్ట్ బేస్ సినిమాలో కూడా రవితేజ కెరీర్ లో ఉన్నాయి. కానీ ఆ సినిమాలు కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇదే విషయాన్ని రవితేజ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతూ ఉంటారు. షాక్, ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ వంటి సినిమాలు చూడటానికి బాగుంటాయి కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి.
ఎందుకంటే రవితేజ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆడియన్ కి వచ్చే కిక్ వేరు. అందుకే ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, కిక్, మిరపకాయ్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు రవితేజకు మంచి కమర్షియల్ సక్సెస్ను అందించాయి. ఇక ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో భాను దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
Paata lo idi ledhu, adi ledhu ani meeru analsina avsram ledu, meme cheppestunnam 😜
Ee paataku rhythm ledhu, tuning ledhu, Thaalam ledhu, Pennu Ledhu, Paper ledhu, Ardam assale ledhu
SUPER DUPER HITTUU SONG ~ From 22nd Oct 🔥#MassJathara pic.twitter.com/dnFjcKaqZ7
— Naga Vamsi (@vamsi84) October 20, 2025
రవితేజ నుంచి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అనే క్లారిటీ కంప్లీట్ గా దర్శకుడు భానుకి ఉంది. అందుకే మాస్ జాతర సినిమాను అలా డిజైన్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒక పాట విపరీతంగా పాపులర్ అయింది. ఆ పాటలో చక్రి వాయిస్ ను ఏఐ క్రియేట్ చేయడంతో మంచి సక్సెస్ సాధించింది చిత్ర యూనిట్.
ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అనే పాట ప్రోమోన్ విడుదల చేశారు. ఈ ఫుల్ సాంగ్ అక్టోబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రోమో షేర్ చేస్తూ నిర్మాత నాగ వంశీ ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పాటలో ఇది లేదు, అది లేదు అని మీరు అనాల్సిన అవసరం లేదు. మేమే చెప్పేస్తున్నాం.
ఈ పాటకు రిథమ్ లేదు, ట్యూనింగ్ లేదు, తాళం లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు, అర్థం అసలే లేదు అని నాగ వంశీ కామెంట్ చేశారు. కానీ పాట ప్రోమో వింటుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అవుతుంది అని అనిపిస్తుంది.
ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా జోరుగా నడిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పనిచేసే పలువురు దర్శకులు ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
Also Read: Bigg Boss Buzz: మనకి బంధాల అవసరమా, భరణికి మరోసారి క్లాస్ పీకిన శివాజీ