E-Paper
Advertisement

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!
Advertisement

Rashmika mandanna: రష్మిక మందన్న (Rashmika mandanna) గత మూడు, నాలుగు సంవత్సరాలుగా జెడ్ స్పీడులో దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఆ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ఒకవైపు వృత్తిపరంగా దూసుకుపోతూనే.. ఇటు వ్యక్తిగతంగా కూడా నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..ఇక విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ బిజీగా మారిన రష్మిక.. ఇప్పుడు మరో అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. భారత దేశ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న దిగ్గజ కర్ణాటక సంగీత విధ్వంసరాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) పాత్రలో రష్మిక కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించింది.

ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక..

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ఎం ఎస్- ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు ఇకపోతే ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ మూవీని ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన్న సుబ్బులక్ష్మిగా నటించబోతోంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు రాగా, ఆ వార్తలను నిజం చేస్తూ చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానులతో పాటు సంగీత ప్రియుల్లో కూడా ఆసక్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు. రష్మిక లాంటి యువ కథానాయికకు భారతీయ సంగీత చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిత్వాలలో ఒకరైన సుబ్బులక్ష్మి పాత్రను పోషించే అవకాశం దక్కడం నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి.

సెప్టెంబర్ 16న ఘనంగా ప్రారంభం..

Advertisement

ఈ చిత్రానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gautham thinnanuri) దర్శకత్వం వహిస్తున్నారు. కథను భావోద్వేగ పూర్వకంగా, సహజమైన శైలిలో తెరకెక్కించడంలో మంచి పేరు దక్కించుకున్న ఈయన…ఇప్పుడు ఎం ఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh ravichander) సంగీతం అందించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ (Allu Aravindh), బన్నీ వాసు (Bunny Vasu), రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం ఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్ చిత్రాన్ని సెప్టెంబర్ 16న చెన్నైలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి విశ్వ నటుడు కమలహాసన్ (Kamala Hassan) ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ALSO READ: బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సుబ్బులక్ష్మికి ఘన నివాళి..

Advertisement

ఇకపోతే ఇదే ఈవెంట్లో ఇండియన్ చోరల్ ఎన్ సెంబుల్ బృందం ఎంఎస్ సుబ్బులక్ష్మి పాడిన ప్రముఖ గీతాలను ఆలపిస్తూ ఆమెకు ప్రత్యేక సంగీత నివాళి అర్పించనున్నారు. ఇక సినిమా ప్రారంభ కార్యక్రమం కూడా సాధారణంగా కాకుండా సుబ్బులక్ష్మి సంగీత వారసత్వాన్ని గుర్తుచేసే ప్రత్యేక వేడుకగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంత గొప్ప పాత్రను పోషించే అవకాశాన్ని రష్మిక సొంతం చేసుకోవడంతో అభిమానులు ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక ఏ మేరకు ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ పూర్తయినట్లు సమాచారం.

Related News

బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

Big Stories

Advertisement
×