David Reddy Movie:టాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మంచు మనోజ్ (Manchu manoj) తాజాగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి (David Reddy). హనుమ రెడ్డి యెక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగూల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సడన్గా బడ్జెట్ కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం .సినిమా బడ్జెట్.. ముందుగా వేసుకున్న అంచనాలను భారీగా మించిపోవడంతో నిర్మాణ పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డాయని టాలీవుడ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 40% షూటింగ్ పెండింగ్లో ఉంది. 1897 – 1922 కాలానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, మరియా ర్యాబోషప్క కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంచనాలకు మించి ఖర్చు పెరగడంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారని , దీనివల్ల షూటింగ్ ను తాత్కాలికంగా బ్రేక్ వేశారని సమాచారం . ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మిగిలిన 40% షూటింగు ఎలా ప్లాన్ చేస్తారు? ఈ ప్రాజెక్టు మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అన్నదానిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి మూవీకి ఇప్పుడు బడ్జెట్ కష్టాలు ఎదురవడం అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
also read:M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!
నేడు రమ్యకృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్న పాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేస్తూ చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందులో రమ్యకృష్ణ కమలారెడ్డి అనే పాత్ర పోషిస్తుంది. ఇకపోతే ఈ పోస్టర్ చూస్తుంటే అందరి కళ్లెదుట బాహుబలిలో శివగామి లుక్ ప్రత్యక్షం అవుతోంది. బాహుబలి సినిమాలో శివగామిగా రాజసం ఉట్టిపడేలా అందరి దృష్టిని ఆకట్టుకుంది రమ్యకృష్ణ. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా అదే తరహాలో ఉండడంతో కాపీ కొట్టారా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి . ఇకపోతే తాజాగా విడుదల చేసిన పోస్టర్లో .. శత్రువులను హతమార్చి.. వారి శవాల మీదే కూర్చొని. చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంగా చూస్తున్నారు రమ్యకృష్ణ. ఈ లుక్కు ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా డేవిడ్ రెడ్డి నుండి కమలా రెడ్డి లుక్ ఆకట్టుకున్నప్పటికీ కాస్త ట్రోల్స్ వస్తున్నాయని చెప్పవచ్చ. ఈ చిత్రంలో మంచు మనోజ్, రమ్యకృష్ణ , అభయ్ డియోల్, సముద్రఖని , రాధాకృష్ణన్ పార్దివన్ లతోపాటు మరికొంతమంది కీలకపాత్రలు పోషిస్తున్నారు.. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.