BCCI On Mohsin Naqvi: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) విజేతగా టీమిండియా నిలిచింది. అయితే శ్రీలంక పై 72 పరుగులు తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా ఉమెన్స్ టీం… ట్రోఫీని మాత్రం నిరాకరించి.. మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi)ని అవమానించింది. బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అస్సలు తీసుకునేది లేదని తెగేసి చెప్పేసింది. దీంతో ఆసియా కప్ ట్రోఫీని తన వెంట మరోసారి తీసుకువెళ్లాడు మొహ్సిన్ నఖ్వీ. అయితే ఈ ట్రోఫీ చోర్ సంఘటనపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో టీమిండియా ఉమెన్స్ జట్టుది తప్పు అని కొంతమంది అంటుంటే… కాదు కాదు, మొహ్సిన్ నఖ్వీ దౌర్జన్యంగా వ్యవహరించాడని మరి కొంతమంది కౌంటర్ ఇస్తున్నారు.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీ చోర్ సంఘటనపై వివాదం రాజుకున్న నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి సరికొత్త కుట్రకు తెరలేపినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ని దించేందుకు బీసీసీఐ కుట్రలకు తెరలేపినట్లు పేర్కొంటున్నారు. 2027 వరకు మొహ్సిన్ నఖ్వీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే, అతడిని పదవి లోంచి దించి.. మరొకరిని కూర్చోబెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్కెచ్ వేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ ను ( Tamim iqbal) ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా చేయాలని బీసీసీఐ పావులు కదుపుతున్నట్లు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రచారం చేస్తోంది. బంగ్లాదేశ్ కు సంబంధించిన తమీమ్, ACC చైర్మన్ పదవిలో కూర్చుంటే టీమిండియా కు రావాల్సిన ట్రోఫీలు సులభంగా తీసుకోవచ్చని బిసిసిఐ ( BCCI) ఈ స్కెచ్ వేసినట్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పహల్గాం ( Pahalgam Incident) సంఘటన నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య యుద్ధమే జరిగింది. అన్యాయంగా భారత యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది ఇండియన్ గవర్నమెంట్. ఈ సంఘటన తర్వాత జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇండియన్స్. అదే సమయంలో ట్రోఫీ ఇస్తే కూడా తీసుకోలేదు. అందుకే మొహ్సిన్ నఖ్వీని అడుగడుగునా ఇండియన్స్ అవమానిస్తూనే ఉన్నారు.