Bigg Boss 10 Naresh: జబర్దస్త్ పొట్టి నరేష్ (Jabardasth Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆయన పొట్టిగా ఉండడం చేత ఆయన వయసు ఎంత అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కుతూహలం కనబరుస్తూ ఉంటారు.. అయితే నరేష్ ఎప్పుడూ కూడా తన ఏజ్ బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఇప్పుడు నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ వ్యాలీడ్ పాయింట్స్ అడుగుతూ ప్రత్యర్థులను చిక్కుల్లో పడేస్తూ తనదైన ఆట తీరుతో దూసుకుపోతున్నారు. ఈయనతో పాటు మరో జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ (Ram Prasad) కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు.
కనీసం ఇక్కడైనా నరేష్ ఏజ్ బయటపడుతుందేమో అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ ఎపిసోడ్ లో భాగంగా రామ్ ప్రసాద్.. నరేష్ వయసు బయట పెట్టాడు. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ..” నరేష్ అందరికీ చిన్నవాడిగా కనిపిస్తాడు. కానీ అతడు చిన్నోడేం కాదు.. వీడి వయసు అక్షరాలా 28 ఏళ్ళు. పైగా ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పొట్టిగా ఉండే నరేష్ వయసు ఇంతా ? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు . మొత్తానికైతే నరేష్ వయసు ఇన్నేళ్లకు బయటపడింది అని చెప్పాలి. మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని రామ్ ప్రసాద్ చెప్పడంతో.. సెట్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గ్యారెంటీగా పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నరేష్ పొట్టివాడిగా ఉన్నా.. తన ఆట, మాట తీరుతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా షాలినిని నామినేట్ చేస్తూ అడిగిన పాయింట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. నరేష్లో ఇంత టాలెంట్ ఉందా? ప్రతిదీ కూడా చాలా చక్కగా అడుగుతున్నాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆట తీరుతో దూసుకుపోతున్న నరేష్ ని చూసి ఈయన టాప్ 5లో ఉండడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
also read: వివాదంలో బిగ్ బాస్ షో.. విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై క్లారిటీ!
నరేష్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా అనంతరం గ్రామంలో జన్మించారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగారు. తల్లిదండ్రులు రోజువారీ జీవనోపాధి పని వెతుక్కుంటూ హైదరాబాదుకి తరలి రావడం.. బాల్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా జోడుప్పల్ లోని కాకతీయ పాఠశాలలో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం ఉండడంతో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. ఇక ఢీ జూనియర్స్ , డాన్స్ రియాల్టీ షోలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్న నరేష్ ప్రతిభను .. జబర్దస్త్ కమెడియన్ సునామీ సుధాకర్ గుర్తించి చంటి కామెడీ బృందంలో అవకాశం కల్పించారు . అలా హౌస్ లోకి అడుగుపెట్టిన నరేష్ ఇప్పుడు దూసుకుపోతున్నారు.