Oppo Watch S2: స్మార్ట్‌వాచ్ ప్రియులకు ఒప్పో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త స్మార్ట్‌వాచ్‌తో త్వరలోనే మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు రూమర్స్, లీకులకే పరిమైన ఈ వాచ్‌పై తాజాగా కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల సెప్టెంబర్ 22న చైనాలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో Oppo Watch S2ను అధికారికంగా లాంచ్ చేయనుంది.
అంతేకాదు.. ఇదే ఈవెంట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Oppo Find X10 సిరీస్ను కూడా కంపెనీ పరిచయం చేయబోతోంది. ఇప్పటికే చైనాలో ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. మరి Oppo Watch S2లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? డిజైన్ ఎలా ఉండబోతోంది? బ్యాటరీ, హెల్త్ ట్రాకింగ్‌తో పాటు ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? ఈ కొత్త వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇక లుక్స్ విషయానికి వస్తే.. గతంలో వచ్చిన Watch S1 మోడల్ పోలికలే దీనికి కూడా ఉన్నాయి. ఇది రౌండ్ డయల్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. బరువు విషయానికి వస్తే గత మోడల్ కంటే ఇది కాస్త లైట్ వెయిట్‌గా ఉంది. స్ట్రాప్ లేకుండా కేవలం 34.4 గ్రాముల బరువు మాత్రమే తూగుతుంది. ఇక మందమైతే కచ్చితంగా 8.9 మిల్లీమీటర్లు ఉంది. లుక్ పరంగా చేతికి పెట్టుకుంటే మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే వచ్చేలా ఉంది. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ట్రెండీగా తెచ్చారు. వైబ్రెంట్ ఆరెంజ్, మిస్టీ పౌడర్, మౌంటైన్ షాడో గ్రే కలర్స్‌లో ఇది మనకు అందుబాటులో ఉంటుంది.
Also Read: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!
ఈ వాచ్‌లో చెప్పుకోవాల్సిన మెయిన్ హైలైట్ ఏంటంటే.. ఇందులో కొత్తగా ఫాట్‌మ్యాక్స్ సూపర్ ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌ను తీసుకువచ్చారు. మనం వర్కవుట్లు చేసేటప్పుడు మన హార్ట్ రేట్ ఆధారంగా ఇది పర్సనలైజ్డ్ ఫ్యాట్ బర్నింగ్‌కు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు.. మనం ఎంత కొవ్వు కరిగిస్తున్నామనేది గ్రాఫిక్స్ రూపంలో క్లియర్ కట్‌గా చూపిస్తుంది. హెల్త్ ట్రాకింగ్ కోసం ఇందులో సరికొత్త సెన్సార్‌ను వాడారు. దీనివల్ల హార్ట్ రేట్ కచ్చితత్వం ఏకంగా 98.8 శాతానికి పెరిగిందని, అలాగే బయటి నుంచి వచ్చే డిస్టర్బెన్స్ 75 శాతం తగ్గిపోయిందని కంపెనీ చెబుతోంది.
స్మార్ట్‌వాచ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే విషయం బ్యాటరీ. అయితే దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ అంటోంది. ఒకవేళ మీరు రెగ్యులర్ వాడకంలో ఉంచితే మాత్రం వారం రోజుల పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. అస్సలు ఆపకుండా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మోడ్ ఆన్‌లో పెట్టుకున్నా సరే.. దాదాపు నాలుగు రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. మనకు సంబంధించిన ఫుడ్ డెలివరీ అప్‌డేట్స్, క్యాబ్ బుకింగ్స్, నేవిగేషన్ లైవ్ యాక్టివిటీస్ అన్నీ నేరుగా వాచ్ స్క్రీన్ మీదనే కనిపించేలా సూపర్ ఫీచర్ కూడా ఇచ్చారు.
Also Read: ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!