E-Paper
Advertisement

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?
Advertisement

Kavya Kalyan Ram -Kalabhairava: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలంగా కావ్య కళ్యాణ్ రామ్ ప్రముఖ సంగీతం దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ(Kalabhairava) రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వాటిలో వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా ఈ వార్తలపై స్పందించలేదు. అయితే ఇటీవల కాలభైరవ కావ్య ఇద్దరు కూడా తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం 

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగిందని తెలుస్తోంది . వీరి నిశ్చితార్థపు ఫోటోలను ఎక్కడా షేర్ చేయకపోయిన కావ్య కళ్యాణ్  రామ్ మాత్రం తన వేలికి ఉంగరం ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ తన ఎంగేజ్మెంట్ పూర్తి అయిందని చెప్పకనే చెప్పేసారు. ఇకపోతే తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

డిసెంబర్ లో కావ్య కాలభైరవల వివాహం..

Advertisement

కావ్య కళ్యాణ్ రామ్, కాలభైరవ ప్రేమలో ఉన్న విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి రెండు కుటుంబాలు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే పెళ్లికి కూడా ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. వీరి వివాహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో (December) నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కావ్య కాలభైరవల వివాహం హైదరాబాదులోనే జరుగుతుందా? లేదంటే డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

కీరవాణి ఇంట కోడలుగా కావ్య 

ఇకపోతే ఈ ఏడాది డిసెంబర్లోనే తన కొడుకు వివాహం కావడంతో ఎంఎం కీరవాణి సైతం తన సినిమా పనులన్నింటిని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి (Varanasi)సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తన కొడుకు పెళ్లి అంటే పెళ్లి పనులలో బిజీ కానున్నారు. అందుకే వారణాసి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. వారణాసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్లో కొంత భాగం పూర్తి చేసి పెళ్లి పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలనటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కావ్య అనంతరం నటిగా బలగం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కీరవాణి ఇంట కోడలుగా అడుగుపెట్టబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ముందుగానే ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

Also Read: సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

Related News

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

బాలీవుడ్ లో సంచలనం.. కియారా – సిద్ధార్థ్ విడాకులా?

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×