Yeshanagula Song: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ (The Paradise) సినిమా ఒకటి. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela)తో కలిసి మరోసారి నాని(Nani) ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పట్ల రోజురోజుకీ అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.
నాని ఖయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఆయా షేర్ అనే పాటతో పాటు ఏసనాగుల(Yeshanagula) కట్ట అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలు కూడా చాలా మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఏష నాగుల కట్ట సాంగ్ మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది. ఈ పాటకు కొరియోగ్రఫీ బాలేదంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఇలా యేషనాగుల సాంగ్ ఈ విమర్శలను దాటుకుంటూ సరికొత్త రికార్డును సృష్టించింది.
ఒకవైపు ఈ పాట పట్ల ట్రోల్స్ వస్తున్నప్పటికీ మరోవైపు అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా గుర్తింపు పొందింది. ఈ పాట విడుదల అయిన కేవలం 17 రోజులలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇలా 17 రోజులలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా ఏషనాగుల కట్ట సరికొత్త రికార్డును సాధించింది. ఇదివరకు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ అనే పాట 19 రోజులలో 100 మిలియన్ వ్యూస్ సాధించగా ఈ పాటను బ్రేక్ చేస్తూ ఏష నాగుల సాంగ్ కేవలం 17 రోజులలోనే వంద మిలియన్ వ్యూస్ సాధించింది.
ఈ ఫోక్ సాంగ్ కు సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా నాని జోడిగా కీర్తి సురేష్(Keerthy Suresh) నటించిన సందడి చేశారు. ఇక ఈ పాట విడుదలైన వెంటనే ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మరొక ఎనిమిది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విడుదల పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు కానీ ట్రైలర్ లేకుండానే ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్ .. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?