Tollywood Heroines : సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది కెరియర్ సాఫీగా సాగిపోతుంది. మరి కొంతమంది కెరియర్ మాత్రం ఎత్తు పళ్ళల్లాగా అప్పుడప్పుడు హిట్స్ సినిమాలు పడుతుంటాయి. ఈమధ్య సినిమాల సంగతేమో కానీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది సినిమాల పై ఆసక్తితో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు.. ఈ మధ్య హీరోయిన్లు దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. వయసులో ఉండగానే పెళ్లి, పిల్లలు చాప్టర్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
అతి చిన్నవయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్లు..
సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. ఇది ఒకప్పటి మాట.. ఈమధ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సులువు అయిపోయింది.. అందం, అభినయంతో పాటుగా అదృష్టం కూడా ఉంటే ఇండస్ట్రీలో నెంబర్ వన్ అయ్యినట్లే. ఒకసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు. వరుస సినిమాలతో దాదాపు నాలుగు ఐదేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. ఆ తర్వాత పెళ్లి ఫ్యామిలీ అని ఆలోచనలు మొదలు పెడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి 40 ఏళ్లు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.. కానీ అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు ఒకసారి చూసేద్దాం…
శాలిని అజిత్..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య శాలిని కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఈమె కూడా 21 సంవత్సరాల వయసులోనే అజిత్ ను వివాహమాడింది.
దివ్యభారతి…
ఈ అమ్మడు అత్యంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకటి రెండు సినిమాల్లోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎంత త్వరగా అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అంతే త్వరగా పెళ్లి చేసుకుంది.. ఈమె 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండానే మరణించింది..
సాయోషా సైగల్..
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అఖిల్. ఇందులో హీరోయిన్ గా చేసిన సాయోషా సైగల్ 21 ఏళ్లలోనే హీరో ఆర్యని వివాహం చేసుకుంది.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…
వీళ్లే కాదు చాలామంది హీరోయిన్లు అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కొందరు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు. మరి కొంతమంది మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. అందులో నజ్రీయా కూడా ఒకరు. అంటే సుందరానికి చిత్రంలో నటించిన నజరియా నజీమ్ కూడా 20 ఏళ్లలోపే వివాహం చేసుకుంది. ఇక మరో మలయాళీ బ్యూటీ అమలాపాల్ కూడా కేవలం 20 సంవత్సరాల వయసులోనే దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది.. వీరితో పాటు బొమ్మరిల్లు ఫెమ్ హీరోయిన్ జెనీలియా కూడా 24 ఏళ్లలోనే పెళ్లి చేసుకుంది.. అప్పట్లో హీరోయిన్లు త్వరగానే పెళ్లి చేసుకున్నారు కానీ ఈ మధ్య హీరోయిన్లు 30 దాటినా కూడా కొంతమంది పెళ్లి ఊసేత్తలేదు..