SSMB 29: : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 (SSMB29) త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ మంచి క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే మహేష్ బాబు చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి చాలామందిని స్టార్ హీరోలను చేశారు. మొదటిసారి ఆల్రెడీ స్టార్ డం ఉన్న మహేష్ బాబు లాంటి హీరోతో పని చేస్తున్నారు.
ఈ సినిమాతో రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చాలామంది అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నవంబర్ 15న ఒక పెద్ద ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ ను గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఈవెంట్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడారు.
నేను ఎప్పుడూ హైదరాబాదులోనే ఉంటున్నాను నాకు ఇక్కడ పని ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాచి ఉన్న ఒక సీక్రెట్ నవంబర్ 15న రివిల్ చేయబోతున్నాము. అని గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ గురించి ప్రియాంక చోప్రా కూడా క్లారిటీ. జియో హాట్ స్టార్ లో ఆ ఈవెంట్ ను చూడాలి అని పిలుపునిచ్చారు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్కు కూడా రీసెంట్ గా విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ చూసి చాలామంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమాల్లో విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో హీరోని మించి విలన్ ఎక్కువగా కనిపిస్తేనే సీన్ ఎలివేట్ అవుతుంది అని రాజమౌళి చెప్పారు కూడా.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాలో బిజ్జల దేవా అనే క్యారెక్టర్ లో నాజర్ కనిపించారు. ఒక చేయి లేకపోయినా కూడా చాలామందిని ఒంటిచేత్తో కంట్రోల్ చేస్తాడు. నాజర్ కి సరిపడా ఎలివేషన్ సీన్స్ కూడా ఆ సినిమాలో ఉంటాయి.
ఇప్పుడు అదే మాదిరిగా పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో అవిటివాడైనా కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా తాను అవతల వాడిని ఎంత నాశనం చేయగలడు అని ఆ చైర్ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా అటువంటి సర్ప్రైజ్ ఏదైనా రాజమౌళి ప్లాన్ చేసి ఉంటాడు అని చాలామంది అంచనా వేస్తున్నారు. నవంబర్ 15 తర్వాత ఈ ప్రాజెక్టు గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Bigg Boss 9 : తనుజ దొంగ గేమ్, అదే తప్పు ఇంకొకరు చేస్తే వదిలేస్తారా?