E-Paper
Advertisement

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్
Advertisement

OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది IMDbలో 9.1/10 రేటింగ్ ను పొందడం విశేషం. ఈ కథ ఇద్దరు స్నేహితులు, వారి స్నేహితురాళ్ల చుట్టూ తిరుగుతుంది. వీళ్లంతా ఒక అడవిలోని ఒంటరిగా ఉండే బంగళాలో విహారయాత్రకు వెళతారు. అక్కడ ఊహించని భయానక సంఘటనలు వారి జీవితాలను తలకిందులు చేస్తాయి. ఈ కథలో సస్పెన్స్, భయం, మానసిక ఒత్తిడి కలగలిసిన ట్విస్ట్‌లు ఉంటాయి. అడవిలోని ఒంటరి వాతావరణం, ధర్మ ప్రకాష్ అందించిన సంగీతం, దినేష్ కుమార్ ఎల్.డి. సినిమాటోగ్రఫీ ఒక సీటెడ్జ్ థ్రిల్లర్ గా నిలుస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …

కథలోకి వెళితే

Advertisement

జీవన్, మణి అనే ఇద్దరు ప్రాణ మిత్రులు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ షాలు, షిబితో కలిసి ఒక దట్టమైన అడవిలో విహారయాత్రకు వెళతారు. వీళ్లంతా అడవిలో ఒంటరిగా ఉండే ఒక అందమైన బంగళాలో రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు. ఈ బంగళా సైలెంట్ గా కనిపించినప్పటికీ, దాని చుట్టూ ఒక వింతైన, భయానక వాతావరణం ఉంటుంది. రాత్రి గడిచేకొద్దీ షాలు తన ప్రియుడు జీవన్‌తో ఒంటరిగా ఉన్నప్పుడు హఠాత్తుగా మరణిస్తుంది. ఈ ఆకస్మిక మరణం గురించి ఎవరికీ స్పష్టమైన కారణం అయితే తెలియదు. దీంతో ఈ బృందం భయం, గందరగోళంలో పడతారు.

Read Also : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

Advertisement

షాలు శవంతో ఒంటరిగా ఉన్న ఈ బృందం, సహాయం కోసం ఎవరినీ సంప్రదించలేని పరిస్థితిలో, భయాందోళనకు గురవుతారు. ఈ సంఘటనను దాచిపెట్టేందుకు వారు తీసుకునే నిర్ణయాలు, వారిని మరింత ఊహించని పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి. ఈ సంఘటన నుండి బయటపడే ప్రయత్నంలో, వీళ్లంతా మరింత ప్రమాదంలో పడతారు. ఇంతకీ షాలు ఎలా చనిపోయింది ? ఆమె స్నేహితులు ఎలాంటి సమస్యల్లో పడతారు ? ఆ బంగ్లా రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

ఏ ఓటీటీలో ఉందంటే

“యాదుం అరియాన్” (Yaadhum Ariyaan) ఒక తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. దీనికి ఎం. గోపి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వి. దినేష్, అప్పుకుట్టి, థంబి రామయ్య, బ్రానా అబ్దుల్సలాం, ఆనంద్ పాండి, శ్యామల్, ఉరియాడి ఆనందరాజ్, రాజకుమారి, తిడియన్, మురుగన్ శివకుమార్ ప్రధాన పాతల్లో నటించారు. 2025 ఆగస్టు 8 నుంచి Aha Tamil లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. IMDbలో ఈ సినిమా 9.1/10 రేటింగ్ ను కూడా పొందింది.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×