E-Paper
Advertisement

హర్రర్ నుంచి కామెడీ వరకు… ఈవారం ఓటీటీలోకి రానున్న మలయాళం సినిమాలు

హర్రర్ నుంచి కామెడీ వరకు… ఈవారం ఓటీటీలోకి రానున్న మలయాళం సినిమాలు
Advertisement

Malayalam OTT Releases: వీకెండ్ రాబోతోంది. మలయాళ మూవీ లవర్స్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ కూడా రెడీ అవుతోంది. కామెడీ నుంచి హారర్, ఎమోషనల్ సినిమాల వరకు ఈ వీకెండ్ ఓటీటీలో మలయాళ సినిమాలు బాగా హైప్‌లో ఉన్నాయి. నాలుగు వేర్వేరు జానర్లలో వచ్చిన కంటెంట్ ఈ వారం అందుబాటులో ఉంది. మరి Saina Play, Sun NXT, JioHotstar, ManoramaMAXలో వచ్చిన ఈ కొత్త మలయాళం సినిమాలు, సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. రివాల్వర్ రింకో (Revolver Rinko)

సానియా ప్లే, సన్ నెక్స్ట్ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. కోజికోడ్ లోని ఓ ఊర్లో, కొందరు చిన్న పిల్లలు తమ ఫ్రెండ్ ను సర్ప్రైజ్ చేయడానికి ఒక సూపర్ హీరో సినిమాను తీయాలి అనుకుంటారు. మరి అనుకున్నట్టుగా ఆ పిల్లలు సినిమా తీశారా ? సినిమా తీయడంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? అన్నది స్టోరీ.

2. పవిత్రం సీజన్ 2 (Pavithram Season 2)

Advertisement

ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జులై 13 నుండి 5 ఎపిసోడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి సీజన్‌ లో టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన ఈ ఫ్యామిలీ డ్రామా, సీజన్ 2లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మరింత సస్పెన్స్‌ తో సాగుతోంది. సాంప్రదాయ విలువలను గౌరవించే వేద స్టోరీనే ఈ సిరీస్. అనుకోని పరిస్థితుల్లో విక్రమ్ ను పెళ్లి చేసుకుంటుంది వేద. గర్భవతిగా కొత్త నగరంలో ఆమె ఒంటరిగా బతకాల్సి వస్తుంది. మరోవైపు విక్రమ్ ఒక తప్పుడు కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. శత్రువుల నుండి తన బిడ్డను రక్షించుకుంటూ, వేద తన భర్తను ఎలా కాపాడుకుంది అనేదే ఈ సిరీస్ ఎమోషనల్ జర్నీ.

3. చితిని (Chithini 2024)

మనోరమా మ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. వినయ్ ఫోర్ట్, అమిత్ చలికల్, బెంగాలీ నటి మోక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో గర్భవతి మహిళ మిస్టీరియస్ గా దారుణ హత్యకు గురవుతుంది. ఆమె అన్యాయంగా చనిపోవడంతో, ఆమె ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ‘చితిని’ అనే పురాణ శక్తీగా మారి తిరిగి వస్తుంది. తన చావుకు కారణమైన వారిని కనిపెట్టి, ఎలా శిక్షించింది అనే నేపథ్యంలో ఈ హారర్ డ్రామా సాగుతుంది. రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

4. మరువశం (Maruvasham)

Advertisement

మనోరమా మ్యాక్స్ ఓటీటీలో మరువశం సినిమాతో పాటు ‘థీ పుకా చారమ్’ (Thee Puka Chaaram) కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరువశం ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా. ‘థీ పుకా చారమ్’ మాత్రం క్రైమ్ సస్పెన్స్ డ్రామా. ఒక రహస్యం చుట్టూ తిరిగే ఈ చిత్రం ఉత్కంఠభరితమైన ట్విస్టులతో సాగుతుంది. ఈ వీకెండ్ మీరు గనుక ఓటీటీలో మలయాళం సినిమాలను చూడాలని ప్లాన్ చేసుకుంటే… కామెడీ కోసం ‘రివాల్వర్ రింకో’, ఎమోషనల్ డ్రామా అంటే ‘పవిత్రం సీజన్ 2’, హారర్ చూద్దాం అనుకుంటే ‘చితిని’ డోంట్ మిస్.

Read Also: బ్రేకప్ అయిన వాళ్ళంతా రెండో ఛాన్స్ కోసం… రమ్యకృష్ణ క్రేజీ రియాలిటీ షో… అన్నీ అలాంటి షోలే

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×