Mari Selvaraj : తమిళ రాజకీయాలకు సినిమాకి మధ్య మంచి సంబంధం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయినిది స్టాలిన్. ఇతను కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.
ఒకవైపు సినిమాల్లో సక్సెస్ సాధిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. తమిళనాడులో డిప్యూటీ సీఎం గా చర్యలు చేపట్టి సక్సెస్ఫుల్ గా తన పదవిని కొనసాగిస్తున్నారు. ఇదివరకే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేశాడు. ఇప్పుడు ఉదయనిది స్టాలిన్ మారీ సెల్వ రాజ్ కు ఒక కొత్త బాధ్యతను అప్పజెప్పారు.
రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ వారసత్వం అనేది ఎప్పటినుంచో కామన్ గా వస్తున్న ప్రక్రియ. ఒక పొలిటిషన్ కొడుకు ఎలా అయితే పొలిటిషన్ అవ్వాలనుకుంటాడు. సినిమా హీరోల కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కనీసం హీరోగా ఎంట్రీ ఇవ్వకపోయినా ఏదో ఒక పని ఇండస్ట్రీలోనే చేయాలి అనుకుంటారు.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ కుమారుడు ఇన్బానిది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇన్బానిథి చేయబోయే సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది తమిళ్ వర్గాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మారి సెల్వరాజ్ ప్రస్తుతం విక్రం కుమారుడు ద్రవ్ విక్రమ్ తో బైసన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా మీద కూడా పలు రకాల అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఉదయనిది స్టాలిన్ కుమారుడితో మారి సెల్వరాజ్ సినిమా ఉండబోతుంది.
ఇకపోతే ఈ విషయం తెలిసిన కొంతమంది తెలుగు అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తనయుడు అకీరానందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అని మరోసారి డిస్కషన్ మొదలుపెట్టారు.
అఖీరానందనకు హీరో అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా తనలో ఉన్నాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ మీద అవగాహన, ఎడిటింగ్ స్కిల్స్ తోపాటు ఫిజికల్ గా కూడా తను చాలా ఫిట్ గా కనిపిస్తాడు.
చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ యూత్ గా ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడేవారు అచ్చం అకీరా కూడా అలానే సిగ్గుపడుతుంటాడు. ఏదేమైనా అకిరా ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అదే హ్యాపీ.
Also Read: Dhanush Sai Pallavi : మరోసారి ధనుష్ సరసన సాయి పల్లవి, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే