Siddu Jonnalagadda: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jinnalagadda) ఒకరు. జోష్ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఈయన అనంతరం గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న ఈయనకు డీజే టిల్లు సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా పనులలో సిద్దు జొన్నలగడ్డ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల జాక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత త్వరలోనే తెలుసు కదా(Telusu Kada) అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవతున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇలా ఒక సినిమాని విడుదల చేస్తూనే ఈయన మరోవైపు మరొక సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ బ్యాడాస్(Badass) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి సిద్దు జొన్నలగడ్డకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే ఈ సినిమా స్టోరీ చాలా విభిన్నంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది.. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అవడంతో అది కాస్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పాటలకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ వీధుల్లో జరుగుతోందని తెలుస్తుంది .ఇలా ఈ పాట చిత్రీకరణ సమయంలో కొందరు వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ పాట షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
నీలోఫర్ కేఫ్ పరిసర ప్రాంతాలలో..
ఈ పాట షూటింగ్ హైటెక్ సిటీ దగ్గర నీలోఫర్ కేఫ్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుతున్నారు. ఇలా ఈ సినిమా కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా సిద్దు జొన్నలగడ్డ భారీగా కష్టపడుతున్నారు. పగలంతా తెలుసు కదా సినిమా షూటింగ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటూ రాత్రి పూట ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని నిర్మాతలు వచ్చే ఏడాదిలో విడుదల చేసేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుసు కదా సినిమా విడుదల అనంతరం సిద్దు జొన్నలగడ్డ పూర్తిస్థాయిలో బ్యాడాస్ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా వెలబడునున్నాయి.
Also Read: Anirudh Ravichandran: హీరోగా అనిరుద్ .. సూపర్ హిట్ చిత్రాన్ని వదులుకున్న బక్కోడు