State Election Commission: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జీవో అమలును నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది.
అయితే.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటనను జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు పేర్కొంది.
ALSO READ: R Krishnaiah: హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్‌కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?