Sarath Kumar: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude) . ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ బ్లాస్ట్ ఈవెంట్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ రంగనాథన్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న నేపథ్యంలో అభిమానులు అన్నా తెలుగులో మాట్లాడు అంటూ కేకలు వేశారు దీంతో ప్రదీప్ తాను కచ్చితంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు నేర్చుకొని వస్తానని ఆరోజు తెలుగులోనే మాట్లాడతానని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarath Kumar) కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శరత్ కుమార్ కూడా పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగులో డబ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే కన్నడ హిందీలో కూడా విడుదల అయితే కచ్చితంగా నేను హిందీ భాషలోనే మాట్లాడుతానని తెలిపారు. ఇక ప్రదీప్ గారు కూడా ఈసారి తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. ఎప్పుడైతే ఒక నటుడు అన్ని భాషలలో మాట్లాడుతారో అప్పుడే అవార్డులు వస్తాయని, అవార్డులు రావాలి అంటే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకోవాలి అంటూ శరత్ కుమార్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇకపోతే శరత్ కుమార్ ఇటీవల కాలం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు .ఇక ఈ సినిమాలో కూడా తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని తనకు ఇలాంటి అవకాశం కల్పించిన నిర్మాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక డ్యూడ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో..మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించగా,మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇదే రోజు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Suvvi Suvvi Song: ఓజీ నుంచి సువ్వి.. సువ్వి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!