Mythri Ravi : ఏదైనా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఆదరించినంతగా పర భాష ప్రేక్షకులు సినిమాలను ఆదరించరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూస్తారు. కొన్ని సందర్భాలలో తెలుగు సినిమాల కంటే మిగతా లాంగ్వేజ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్.
అందుకే కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా టీజర్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు పలు రకాల కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఇతర భాష సినిమాలను తెలుగులో ఆదరించినంతగా మన తెలుగు సినిమాలను ఇతర భాషల్లో ఆదరించరు అనేది ఒకటి ఉంది. దానిని పరిగణలోకి తీసుకొని ఒక జర్నలిస్ట్ ఇదే ప్రశ్నను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి ను అడిగారు.
అలా ఏమీ ఉండదండి దివాళి అనేది తమిళనాడులో బిగ్గెస్ట్ ఫెస్టివల్. మనతో పోలిస్తే తమిళనాడులో థియేటర్లు నెంబర్ చాలా తక్కువ. మహా అయితే అక్కడ ఒక 600 ఉన్నాయి అనుకుంటున్నాను. అది కరెక్ట్ కూడా నాకు తెలియదు మహా అయితే 800 థియేటర్స్ ఉన్నాయి. మనకు మాత్రం 1800 థియేటర్లు ఉన్నాయి. అక్కడ కొన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఎక్స్ ధియేటర్లో కొన్ని సినిమాలు, వై థియేటర్లో కొన్ని సినిమాలు అంటూ డివైడ్ అవుతుంటాయి.
ఫస్ట్ డే సినిమాకు వచ్చే టాకును బట్టి అక్కడ సినిమా ధియేటర్లు అడ్జస్ట్ అయిపోతుంటాయి. బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. నువ్వు మంచి కంటెంట్ ఇస్తే ఆటోమెటిగ్గా థియేటర్స్ నీకు వచ్చేస్తాయి. అంతేకానీ ఊరికే థియేటర్స్ రావట్లేదు అని అనడం కరెక్ట్ కాదు. మనం ఆ విధంగా ఎవరిని బ్లేమ్ చేయకూడదు చేయకూడదు. పొంగల్ టైంలో మనకు కూడా ఒక రూల్ ఉంది అదంతా వేరే టాపిక్ అంటూ మైత్రి రవి ఆన్సర్ ఇచ్చారు.
వాస్తవానికి రీసెంట్ గా కిరణ్ అబ్బవరం తన సినిమాకు సంబంధించి ఒక ప్రముఖ తమిళ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కు హైదరాబాదులో మంచి ఆదరణ చూపిస్తాము థియేటర్స్ కూడా ఆయనకు ఎక్కువ ఇస్తారు. కానీ నా క సినిమాకు ఇక్కడ థియేటర్స్ ఇవ్వమని డైరెక్ట్ గా చెప్పేశారు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు మైత్రి రవి కంటెంట్ బాగుంటే అని చెప్పడం కిరణ్ కి కౌంటర్ లా అనిపిస్తుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ మైత్రిలోనే సినిమా చేసిన విషయం తెలిసిందే.
Also Read : Pradeep Ranganathan : మీరు హీరోలా ఉండరు, లేడీ రిపోర్టర్ ని ఉతికి పారేసిన ప్రదీప్ రంగనాథన్