Ustaad Bhagat Singh release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ లో మోస్ట్ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా మంచి సక్సెస్ అయింది కాబట్టి. ఆ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది.
దాదాపు పది సంవత్సరాలు పాటు హిట్టు లేని పవన్ కళ్యాణ్ కెరియర్ కు ఆ సినిమా ఊపిరి పోసింది. పవన్ కళ్యాణ్ కంటే కూడా అభిమానులకు ఊపిరి పోసింది అని చెప్పాలి. స్వతహాగా హరీష్ కూడా అభిమాని కావడంతో ఆ సినిమాను ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేశాడు.
పవన్ కళ్యాణ్ అభిమానులు రీసెంట్ గా వచ్చిన ఓ జి సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు. ముఖ్యంగా సుజిత్ ఆ సినిమాని డీల్ చేసిన విధానం పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా సంతృప్తిపరిచింది. ఇప్పుడు వాళ్ళ అంచనాలన్నీ కూడా ఉస్తాద్ సినిమా మీద ఉన్నాయి.
ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాదు అని తెలుస్తుంది. ఈ సినిమాను మే 8 వ తారీకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ కు త్రివిక్రమ్ కు మధ్య ఏవో భిన్న అభిప్రాయాలు వచ్చాయి అని అప్పట్లో కథనాలు వినిపించాయి.
పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ క్లోజ్ కాబట్టి ఉస్తాద్ సినిమాను కొంచెం పక్కన పెట్టి తను ఇన్వాల్వ్ అయిన సినిమాలను పూర్తిచేసేలా ప్లాన్ చేసుకున్నాడు అంటూ ఆ కథనాలు సారాంశం. అయితే ఇవేవీ కరెక్ట్ కాదు అంటూ హరీష్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసి కొంత మేరకు షూటింగ్ జరిగిన తర్వాత హరీష్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. ఆ సినిమా ఆడియో విపరీతంగా హిట్ అయింది. సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో ఆడలేదు. ముఖ్యంగా ఆ కాంబినేషన్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా రీచ్ కాకపోవడం సినిమా రిజల్ట్ ను దెబ్బకొట్టింది.
Also Read: Bunny Vasu On Bandla Ganesh: బండ్ల గణేష్ ఆ రోజు చేసింది మర్చిపోలేను, ఉన్న హ్యాపీ మూడ్ అంతా పోయింది