OTT Movie : డాక్యుమెంటరీ సిరీస్ లు నిజమైన హార్ట్‌బ్రేకింగ్ స్టోరీలతో, ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రతీ అంశం మీద ఇవి ఫోకస్ అవుతున్నాయి. మేకర్స్ కూడా ఈ స్టోరీలను రియలిస్టిక్ గా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి అటు కిల్లర్ గా, ఇటు ఫ్యామిలీ మ్యాన్ గా బ్యాలెన్స్ చేస్తూ తన టాలెంట్ ను చూపించాడు. ఆ టాలెంట్ కూడా హత్యలు చేయడంలో చూపించాడు. పది మందికి పైగా, అతి కిరాతకంగా చంపిన డెన్నిస్ అనే వ్యక్తి గురించి ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘మై ఫాదర్, ది బీటీకే కిల్లర్’ (My Father, the BTK Killer)ఒక అమెరికన్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్. దీనికి స్కై బోర్గ్‌మన్ రూపొందించారు. ఇది సీరియల్ కిల్లర్ డెన్నిస్, అతని కూతురు కెర్రీల జీవిత ప్రయాణాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంటరీ 2025 అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. IMDbలో ఇది 7.5/10 రేటింగ్ పొందింది.
డెన్నిస్ అనే వ్యక్తి చూడటానికి పైకి చాలా మంచిగా ఉంటాడు. చర్చ్ కి కూడా వెళ్తుంటాడు. ఫ్యామిలీతో మంచి బంధం మైన్టైన్ చేస్తుంటాడు. ఇది అతనికి ఉన్న ఒక రూపం మాత్రమే. అతనికి మరో రూపం కూడా ఉంది. అతను ఎవరోకాదు, ఒక సైకో కిల్లర్. అతని అతను 1974 నుంచి, పది సంవత్సరాలలో దాదాపు 10 మర్డర్లు చేశాడు. ఇవి కనిపించినవి మాత్రమే. డెన్నిస్ కి మరో పేరు కూడా ఉంది. అతన్ని బి. టి. కే కిల్లర్ అనికూడా పిలుస్తుంటారు. దీని అర్థం బైండ్, టార్చర్, కిల్ అని వస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళను ఎంత ఘోరంగా చంపాడో అతనికి ఉన్న ఈ పేరును బట్టి తెలుస్తుంది.
అయితే అతను చేసిన మిస్టేక్ వల్ల 2005లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ విషయం అతని కూతురు కెర్రీకి తెలియడంతో ఆమె షాక్ అవుతుంది. తన తండ్రి ఒక సైకో కిల్లర్ అని మొదట నమ్మలేకపోతుంది. ఎందుకంటే అతను ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉండేవాడు. ఇక ఈ డాక్యుమెంటరీలో కెర్రీ ప్రయాణం కూడా ఉంటుంది. ఆమె తన తండ్రి మాతో గడిపిన రోజులు నిజమా, నాటకంలో ఒక భాగమా అనే సందేహంలో పడుతుంది. తన తండ్రి కిల్లర్ అని తెలిసాక ఆమె కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందో ఈ సిరీస్ చూపిస్తుంది. అసలు డెన్నిస్ ఎందుకు కిల్లర్ గా మారాడు ? అంతఘోరంగా ఎందుకు చంపాడు ? కెర్రీ పద్దబాధలు ఏమిటి ? అనే విషయాలను, ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని చూసి తెలుసుకోండి.