Dhanush Sai Pallavi : కొంతమంది హీరోయిన్స్ కెరియర్ లో చెప్పుకునేంత సక్సెస్ లేకపోయినా కూడా, ఎక్కువ శాతం సినిమాలు ఫెయిల్ అయిన కూడా, వాళ్ళు చేసిన ఏదో ఒక పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలా మలయాళం ప్రేమమ్ సినిమాలో నటించిన సాయి పల్లవి అందరికీ కనెక్ట్ అయిపోయింది.
అప్పటికే సోషల్ మీడియా ఎక్కువగా ఉండటం వలన ప్రేమమ్ అనే సినిమా బాగుంది అని సోషల్ మీడియాలో పోస్టులు పడినప్పుడు చాలామంది తెలుగు యువత ఆ సినిమాను చూడటం మొదలుపెట్టారు. అక్కడితో సాయి పల్లవి ఫోటోలు డౌన్లోడ్ చేస్తూ క్రష్ అంటూ పోస్టులు కూడా పెట్టేవాళ్ళు. మొత్తానికి తెలుగులో ఫిదా సినిమా చేసి తన పర్ఫామెన్స్ తో అందరిని ఫిదా చేసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీ. వరుణ్ తేజ్ కెరియర్ కు కూడా ఈ సినిమా మంచి ప్లస్ అయింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మొత్తానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాలో నాగచైతన్య తో సాయి పల్లవి ను చూసి పర్ఫెక్ట్ జోడి అని ఫీల్ అయ్యారు. వీరిద్దరూ కలిసి చివరగా తండెల్ సినిమాలో కూడా కనిపించారు.
ధనుష్ హీరోగా చేసిన మారి 2 సినిమాలో సాయి పల్లవి నటించిన. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఒకవైపు తెలుగు ఫిలిమ్స్ చేస్తూనే మరి వైపు తమిళ్ లో కూడా విపరీతంగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది సాయి పల్లవి. తర్వాత కాలంలో లేడీ పవర్ స్టార్ అనే గుర్తింపు కూడా సాధించుకుంది.
మరోసారి ధనుష్ తో పాటు హీరోయిన్ గా కనిపించనుంది సాయి పల్లవి. మారి సెల్వరాజ్ ధనుష్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
పెరియారమ్ పెరుమాళ్ అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారి సెల్వరాజ్. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా కర్ణన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మళ్లీ దర్శకుడుగా మారికి అవకాశం ఇచ్చాడు ధనుష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
Also Read: Bunny Vasu On Bandla Ganesh: బండ్ల గణేష్ ఆ రోజు చేసింది మర్చిపోలేను, ఉన్న హ్యాపీ మూడ్ అంతా పోయింది