Mamitha Baiju : కొన్ని సినిమాలు కొందరికి విపరీతమైన క్రేజ్ తీసుకొస్తాయి. ఆ క్రేజ్ అనేక సినిమాలు చేయటానికి ఉపయోగపడుతుంది. ఒక సక్సెస్ పడగానే అవకాశాలు వస్తాయి అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం ఎప్పుడు నుంచో ప్రూవ్ అవుతూ వస్తుంది. అలానే ఫెయిల్యూర్ వస్తే వచ్చిన అవకాశాలు కూడా దూరమైపోతుంటాయి.
ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది మమత బైజు. మలయాళం లో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకుల గురించి తెలిసిందే కదా.. ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమాలో హీరోయిన్ ని పట్టుకొని న్యూ క్రష్ అంటూ ఫోటోలు షేర్ చేస్తుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది కామన్ గా జరుగుతుంది. కానీ తన సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే మమత బైజు టాలెంట్ గుర్తించాడు ఒక దర్శకుడు.
ప్రస్తుతం మమిత బైజు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మమిత బైజు ను తీసుకోవడానికి అసలైన కారణం రివిల్ చేశాడు దర్శకుడు కీర్తి శ్వరన్.
డ్యూడ్ సినిమాకి సంబంధించి ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది. అప్పుడు ఒకరోజు ఇంస్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్న టైంలో ఒక క్లిప్ దర్శకుడికి కనిపించింది. అది 2022 లో వచ్చిన సూపర్ శరణ్య సినిమాలోనిది. అప్పటికే ప్రేమను సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ ఆ రీల్ లో మమిత బైజు ను చూసి తన ప్రెజెన్స్ అండ్ యాటిట్యూడ్ బాగా నచ్చి అప్పుడే డిసైడ్ అయిపోయాడు.
ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కి చెప్పి తనను కాస్ట్ చేశారు. రెండు వారాల తర్వాత ప్రేమలో సినిమా విడుదలైంది. తనకు సెన్సేషనల్ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆమెను కలిశాడు దర్శకుడు కీర్తి. వెంటనే కథను చెప్పడంతో తను కూడా ఎక్సైట్మెంట్ ఫీల్ అయి ఓకే చెప్పింది. ఆ విధంగా మమితా బైజును డ్యూడ్ సినిమాలోకి తీసుకున్నారు.
ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండు సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. డ్రాగన్ సినిమా తర్వాత డ్యూడ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు. సినిమా మ్యూజిక్ కూడా మంచి హిట్ అయింది. మరి దివాలి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే అప్పటివరకు వేచి చూడకు తప్పదు.
Also Read: Pradeep Ranganathan : మీరు హీరోలా ఉండరు, లేడీ రిపోర్టర్ ని ఉతికి పారేసిన ప్రదీప్ రంగనాథన్