Suvvi Suvvi Song: డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజి(OG). సెప్టెంబర్ 25వ తేదీ ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ప్రస్తుతం అయితే థియేటర్లలో ఓజి స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ప్రకటన వెలబడలేదు.
ఇకపోతే ఈ సినిమా నుంచి మేకర్స్ మరొక బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో సువ్వి సువ్వి (Suvvi Suvvi)అనే పాట ఎంతలా హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ కైవసం చేసుకుని ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా నిర్మాతలు ఈ పాటకు సంబంధించి ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో వ్యూస్ రాబడుతుంది.. పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ మధ్య వచ్చే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాటకు తమన్ అందించిన అద్భుతమైన సంగీతం అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ఈ పాటకు థియేటర్లో కూడా ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
ఈ అద్భుతమైన పాటకు తమన్ సంగీతం అందించగా సింగర్ శృతి రంజని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించి ఫుల్ వీడియో సాంగ్ బయటకు రావడంతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది. ఓజి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్ సన్ని వేషాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ నుంచి సరైన సక్సెస్ రాకపోవడంతో అభిమానులు ఎంతో ఆకలితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చారనే చెప్పాలి.
ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజి యూనివర్స్ గురించి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయని తెలియజేశారు. అయితే తదుపరి సీక్వెల్ సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలపరంగా యాక్టివ్ అవుతున్నారు. ఈయన డైరెక్టర్ సుజిత్ తో మాత్రమే కాకుండా మరి కొంతమంది దర్శకులకి కూడా అవకాశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read: Siddu Jonnalagadda: అర్ధరాత్రి హైదరాబాద్ వీధుల్లో సిద్దు జొన్నలగడ్డ..భలే కష్టపడుతున్నాడుగా!