Pradeep Ranganathan : తెలుగు మీడియా జర్నలిజం ఎలా తయారయింది అంటే రోజురోజుకు ఎక్కడికి జారిపోతుంది. కేవలం మీడియాలో ఫేమస్ అవడం కోసం. లేదంటే అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం సినిమా నటులని చిత్ర యూనిట్ ను చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.
రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమాకి సంబంధించి అయినా ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగినప్పుడు చిత్ర యూనిట్ ముందు కొంతమంది మీడియా జర్నలిస్టులు ఉంటారు. వాళ్ల వెనుక భాగంలో కొంతమంది ఆడియన్స్ కూడా ఉంటారు. వారి సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టి ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది కొన్ని రోజుల నుంచి వస్తున్న ఆనవాయితీ. అలాకాకుండా ట్రైలర్ ను ముందు రిలీజ్ చేసి ట్రైలర్ రెస్పాన్స్ గురించి సినిమా రిలీజ్ గురించి మాట్లాడే పద్ధతి కూడా ఉంది.
ఈ తరుణంలో కొంతమంది జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తుంది చిత్ర యూనిట్. ఆ ప్రశ్నలు సినిమాకి సంబంధించిన ఉంటే ఓకే. కానీ పర్సనల్ లైఫ్ ని అటాక్ చేసేలా ఉంటాయి కొన్ని ప్రశ్నలు. ప్రస్తుతం డ్యూడ్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ కు అటువంటి ప్రశ్న ఎదురైంది.
ఒక ప్రముఖ జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథన్ ను ఉద్దేశిస్తూ మొదట ఇంకొకలా తీసుకోకండి అని వెన్న పుస్తూనే…. మీరు చూడడానికి సినిమా హీరోల కనిపించరు. రెండు సినిమాలకి మీకు ఇంత సక్సెస్ వచ్చింది ఇది మీ లక్ ఆ అనే విధంగా ప్రశ్నించింది.
ఖచ్చితంగా ఈ ప్రశ్న విన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. ప్రదీప్ ఆన్సర్ చెప్పడానికంటే ముందు సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హీరో అంటే ఇలా ఉండాలి అనే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దీటుగా ఆన్సర్ ఇచ్చి లాస్ట్ లో ఆమె మాదిరిగానే చిన్న పంచ్ విసిరారు.
స్వతహాగా కష్టపడి పైకి రావడం, డైరెక్టర్ కావడం, కష్టపడటం వంటి లక్షణాలు ప్రదీప్ రంగనాథన్ కు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా డీల్ చేసాడు. ప్రదీప్ మాట్లాడుతూ బయట చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను వాళ్ళందరిని చూశాను. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మొదటిది హార్డ్ వర్క్. రెండోది లక్. వీటన్నిటిని మించి చాలామంది వాళ్లను నాలో చూసుకుంటున్నారు.
వాళ్లు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్లే మేము హీరోలం అని ఫీల్ అవుతున్నారు. మేమే యాక్టింగ్ చేస్తున్నాం, మేమే ఫైటింగ్ చేస్తున్నాం, మేమే రొమాన్స్ చేస్తున్నాం అని నా సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఫీలవుతున్నారు. వాళ్లు నాలోని హీరోని చూసుకుంటున్నప్పుడు నేను ఆల్రెడీ హీరోనే అంటూ ఆడియన్స్ ఉద్దేశించి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్.
Also Read: Ustaad Bhagat Singh release : పవన్ కళ్యాణ్ సినిమా రూమర్స్ కు చెక్,రిలీజ్ అప్పుడే