Fires in OG Movie Theatre: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ గురువారం భారీ ఎత్తున్న విడుదలైంది. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్గా ఓజీ మూవీ థియేటర్లోకి వచ్చింది. ముందు రోజు కూడా భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఓజీ మూవీ భారీగా కలెక్షన్స్ చేశాయి. ఫస్ట్ డే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 133 కోట్ల గ్రాస్ చేసింది. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి థియేటర్లలో షోలను సైతం పెంచారు. ప్రతి షో హౌజ్ ఫుల్ కనిపిస్తున్నాయి. ప్రతి థియేటర్లలో ఓజీ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. ఈ క్రమంలో ఓవర్సిస్లో ఓ థియేటర్లలో దారుణంగా జరిగింది.
థియేటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించిన సంఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురువారం తెల్లవారుజామున ఫిలిం.సి అనే థియేటర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓజీ మూవీ రిలీజ్ గ్రాండ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కెనడాలోని ప్రముఖ థియేటర్లలో మూవీ రిలీజ్కి కొన్ని గంటల ముందు థియేటర్లలో నిప్పు అంటించారు. సంఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సదరు థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ.. నోట్ విడుదల చేసింది.
“సెప్టెంబర్ 25న ఓజీ మూవీ రిలీజ్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు తెల్లవారు జామున కొందరు దుండగులు థియేటర్లలో చోరబడి పెట్రోల్ పోసి నిప్పటించారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ కూడా గాయపడలేదు. ప్రస్తుతం థియేటర్లను పూర్తి స్థాయిలో తెరిచి ఉంది. ప్రేక్షకులు కూడా అన్ని విధాలుగా భద్రత కల్పిస్తున్నాం. వారంత సురక్షితంగా ఉన్నారు. ఓజీ మూవీతో సహా అన్ని సినిమా ప్రదర్శనలు నిర్ణిత షెడ్యూల్ ప్రకారమే ప్రదర్శిస్తున్నాం. ఇండియన్ సినిమా ప్రదర్శన సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. ఇవి తరచూ పునరావృతం అవుతున్నాయి.
ఈ చర్యలు మమ్మల్ని ఇబ్బంది గురి చేసినా.. మేము వాటికి భయపడం. నిజానికి ఓజీ సినిమాను ముందుగా ‘మూవీ చైన్’ అనే సంస్థ అగ్రీమెంట్ చేసుకుంది. అయితే వాళ్లు ఈ చిత్రం ప్రదర్శనను విరమించుకోవడంతో వేరే సంస్థ తరపున మూవీ రిలీజ్ చేశాం. మూవీని రిలీజ్ చేయొద్దంటూ బెదిరింపులు వచ్చాయి. వినకపోవడంతో థియేటర్లలో పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. తరచూ ఇలాంటి ఘటనలు ఎదురవడం విచాకరకం. కానీ, ఇలాంటి హింసాత్మక చర్యలకు మేము భయపడము. ఈ ఘటనపై హాల్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది. మేము పూర్తిగా హాల్టన్ పోలీసులకు సహాకరిస్తున్నాం. ప్రేక్షకులకు మరింత రక్షణ కల్పించేందుకు భద్రత ఏర్పాట్లను పెంచాం. ఈ ఘటనకు సంబంధించి మీకు ఎలాంటి సమాచారం ఉన్న హాల్టన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని” ఈ ఫిలిం.సి సంస్థ సీఈవో జెఫ్ నోల్ ప్రకటనలో పేర్కొన్నారు.
🚨 Cowardly Attack Fails: https://t.co/9TNzgavfeD Cinemas Remains Open and United 🚨
In the early hours of September 25, https://t.co/9TNzgavfeD Cinemas was the target of an attempted arson. Thankfully, no one was on site, and our theatre remains fully open and safe for guests.… pic.twitter.com/OL6BpkzOH7
— Film.Ca Cinemas (@FilmCaCinemas) September 25, 2025