Perni nani Vs Balakrishna: అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన కామెంట్స్‌ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో వైసీపీ పడిందా? దీన్ని అడ్డుపెట్టుకుని కూటమిలో చీలికలు తేవాలని ఆలోచన చేస్తోందా? దాని బాధ్యతలను ఇద్దరు మాజీ మంత్రులకు అప్పగించిందా? పేర్నినాని వ్యాఖ్యలు అందుకు నిదర్శనమా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.
ఏపీలో వైసీపీ ప్లాన్ ఒక్కటే. ఏదో విధంగా కూటమిలో పార్టీల మధ్య చీలిక తేవాలని ఆలోచన చేస్తోంది. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా అస్త్రాలను ఎక్కుపెడుతూనే ఉంది. కూటమి నుంచి పవన్ కల్యాణ్ దూరం చేసే బాధ్యతను వైసీపీ అధినేత జగన్, ఇద్దరు నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది.
వారిలో ఒకరు పేర్ని నాని కాగా, మరొకరు అంబటి రాంబాబు. ఇద్దరు నేతలు మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినా, వారికి సంబంధించి విషయాలు వచ్చినా తొలుత ఈ నేతలు రియాక్ట్ అవుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యల విషయంలో ఇప్పుడూ అదే చేశారనుకోండి.. అదే వేరే విషయం.
గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. శుక్రవారం మీడియా ముందుకొచ్చిన ఆయన, చిరంజీవి-పవన్ కళ్యాణ్ అంటే బాలకృష్ణకు ఈర్ష్య, ద్వేషమని వ్యాఖ్యానించారు. మెగా బ్రదర్స్ అంటే ఆయనకు అస్సలు పడదన్నారు. పడలేనప్పుడు ఈ విషయాన్ని మీ బావ దృష్టికి తీసుకెళ్తే బాగుండేదన్నారు.
ALSO READ: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో సంప్రదాయాలు పాటించరా?
బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు మా బావ పెండింగ్‌లో పెట్టారంటూ హరికృష్ణ అనే అధికారితో బాలకృష్ణ చెబితే వెంటనే జగన్ ఆ బిల్లులు క్లియర్ చేయించారని గుర్తు చేశారు. ఈ లెక్కన చంద్రబాబు-బాలకృష్ణ మధ్య విభేదాలు పెట్టించే ప్రయత్నం చేశారాయన. మరి జగన్ ఎందుకు సైకో అయ్యారని ప్రశ్నించారు. ఒక్కరోజైనా బసవతారకం ఆసుపత్రిని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా అంటూ మండిపడ్డారు.
జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ స్వయంగా తనకు ఫోన్ చేశారని గుర్తు చేశారు పేర్ని నాని. అఖండ సినిమా రిలీజ్ విషయంలో బాలకృష్ణ తనకు కాల్ చేశారని, టికెట్ రేట్ల విషయంలో సహకరించాలని మమ్మల్ని కోరారని అన్నారు. ఈ విషయం జగన్‌కి చెబితే వాళ్లకు కావాల్సింది చేయాలని చెప్పారని వివరించారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయాలు మెగా ఫ్యామిలీ క్షుణ్నంగా గమనిస్తోంది. బాలకృష్ణ వ్యాఖ్యలను లైటుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నేరుగా చిరంజీవి పేరు ఎత్తలేదని, బీజేపీ నేత ప్రస్తావించిన దానికి బదులు ఇచ్చారని అంటున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటరని మెగా ఫ్యామిలీ అంచనా వచ్చినట్టు చెబుతున్నారు. కొన్నాళ్లుగా టీడీపీ-జనసేనను దూరం చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందంటూ మెగా క్యాంప్‌లో బలంగా టాక్ నడుస్తోంది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే బాలకృష్ణకు ఈర్ష్య, ద్వేషం. మెగా బ్రదర్స్ అంటే ఆయనకు పడదు
– మాజీ మంత్రి పేర్ని నాని pic.twitter.com/C6qFSp5UZ0
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2025