BigTV English

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

PMAY Home Loan: ‘ప్రధాన మంతి ఆవాస్ యోజన పథకం’ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఆర్థిక సహాయం చేస్తుంది. PMAY ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు ఆర్థిక సాయంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు. ఈ రుణాల వడ్డీపై సబ్సిడీ కూడా ఇస్తారు. 20 సంవత్సరాల పాటు గృహ రుణాలపై 6.5 శాతం వరకు ముందస్తు వడ్డీ సబ్సిడీతో పాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో అనేక ప్రయోజనాలను అందిస్తున్నారు


పీఎంఏవై-గ్రామీణ

పీఎంఏవై-గ్రామీణ పథకంలో కనీస ఇంటి నిర్మాణం 20 చదరపు మీటర్ల నుంచి 25 చదరపు మీటర్లు ఉండాలి. మైదాన ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, కొండలు, గిరిజన, వెనుకబడిన ప్రాంతాలలో రూ.1.30 లక్షలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తారు.

లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి లేదా బాగుచేసుకోవడానికి EWS వర్గాలకు రూ.1.5 లక్షల కేంద్ర సహాయం అందిస్తుంది. లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవడానికి 3% వడ్డీ రేటుతో రూ.70,000 వరకు అదనపు రుణం పొందవచ్చు. వివిధ సబ్సిడీ రేట్లతో రూ.2,00,000 రుణ సదుపాయం ఉంటుంది. అయితే ఇంటి కనీస పరిమాణం 25 చదరపు మీటర్లు ఉండాలి. స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్ లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.12,000 ఆర్థిక సహాయం చేస్తారు. ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారుడు 95 రోజుల పాటు రోజుకు రూ.90.95 చొప్పున ఉపాధి పొందే హక్కును కల్పిస్తారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో భాగంగా వీరికి ఉచిత LPG కనెక్షన్ అందిస్తారు.


పీఎంఏవై-అర్బన్

PMAY-అర్బన్ 2.0 ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్రం. అర్హత కలిగిన EWS, LIG, MIG కుటుంబాలకు గృహ రుణాలపై రూ.1.80 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ ఉంటుంది. ఈ పథకం 45 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మించడానికి లేదా 120 చదరపు మీటర్ల వరకు (వడ్డీ సబ్సిడీ లేకుండా) ఇళ్లను కొనుగోలు చేయడానికి మద్దతు ఇస్తారు.

పీఎంఏవై అర్బన్ మార్గదర్శకాలు

PMAY పథకంలో అర్హులను నాలుగు వేర్వేరు ఆదాయ వర్గాలుగా విభజిస్తారు.

– ఆర్థికంగా బలహీన వర్గం (EWS): వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.

– తక్కువ ఆదాయ గ్రూప్ (LIG): వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3-6 లక్షల పరిధిలోకి వస్తుంది.

– మధ్య ఆదాయ గ్రూప్-I (MIG I): కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి 12 లక్షల వరకు ఉంటుంది.

– మధ్య ఆదాయ గ్రూప్- II (MIG II): కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎక్కువ, రూ. 18 లక్షల కంటే తక్కువ ఉండాలి.

దరఖాస్తు చేసుకున్న వారు పీఎంఏవై పోర్టల్ ‘సిటిజన్ అసెస్‌మెంట్’ లో ‘ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్’పై క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

లబ్దిదారులకు గృహ రుణం

పీఎంఏవై పథకంలో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS)లో భాగంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర సంస్థల నుండి గృహ రుణాలను అందిస్తారు. ఆర్థికంగా బలహీన వర్గం (EWS), తక్కువ ఆదాయ వర్గం (LIG), మధ్య ఆదాయ వర్గం (MIG)-I, మధ్య ఆదాయ వర్గం (MIG)-II కి చెందిన లబ్ధిదారులకు రూ.6 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ రుణాలపై 6.5%, 4%, 3% వడ్డీ సబ్సిడీ కూడా ఉంటుంది. లబ్దిదారులకు రూ.6 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ ఉంటుంది. ఆ పై రుణాలకు వడ్డీ రేటు సబ్సిడీ తగ్గుతుంది.

ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ లబ్దిదారులకు 20 సంవత్సరాల కాలపరిమితితో 6.5% రేటుతో వడ్డీ సబ్సిడీకి అర్హులు. కొత్త ఇల్లు నిర్మాణం లేదా ఇప్పటికే ఉన్న ఇంటికి గదులు, వంటగది, టాయిలెట్ నిర్మాణానికి గృహ రుణాలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.

Alos Read: Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

ఎంఐజీ-I వారికి రూ.6,00,001 నుండి రూ.12,00,000 వరకు, ఎంఐజీ-II వర్గం వారికి రూ.12,00,001 నుండి రూ.18,00,000 వరకు రుణసదుపాయం ఉంటుంది. MIG-I లో రూ.9 లక్షల వరకు రుణాలపై 4% వడ్డీ సబ్సిడీ అందిస్తారు. MIG-II లో రూ.12 లక్షల రుణ మొత్తానికి 3% వడ్డీ సబ్సిడీ అందిస్తున్నారు.

Related News

LPG Gas Cylinder: పండుగ వేళ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై బంపర్ ఆఫర్లు! జస్ట్ ఇలా చేస్తే చాలు..!

Jio Super Plan: వేర్వేరు రీఛార్జ్‌లకి ఇకనుంచి గుడ్‌బై.. జియో సూపర్ ప్లాన్‌తో ముచ్చటగా ముగ్గురికి

Aadhaar update: ఆధార్ కార్డు అప్‌డేట్ ఫ్రీ కేవలం ఈ నెలవరకే.. అక్టోబర్ నుంచి ఛార్జీలు డబుల్

Jio Vs Airtel: జియో vs ఎయిర్‌టెల్‌ ఏది బెస్ట్? ఫ్రీ బెనిఫిట్స్ ఎవరు ఇస్తారు?

7-Seater Launched: జస్ట్ రూ.1.50 లక్షలకే రెనాల్ట్ 7-సీటర్ కారు, ఫీచర్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Splendor Electric New Bike: 400 కిమీ రేంజ్, 110 కిమీ స్పీడ్.. వచ్చేస్తోంది సరికొత్త ఎలక్ట్రిక్ స్ప్లెండర్!

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

BSNL Best Plan: రూ.225 ప్లాన్‌లో దుమ్మురేపే ఆఫర్లు.. డేటా, కాల్స్, SMSలతో ఫుల్ ఎంజాయ్

Big Stories

×