E-Paper
Advertisement

క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్‌పై..

క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్‌పై..
Advertisement

తమ నటనతో.. తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే కొంతమంది సెలబ్రిటీల జీవితాలలో మహమ్మారి ఏ విధంగా విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కొని కొంతమంది ధైర్యంగా నిలబడితే.. మరి కొంతమంది తట్టుకోలేక తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాను అంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ హాస్పిటల్ బెడ్ పై నుండి టాలీవుడ్ బ్యూటీ పంచుకున్న ఫోటోలు ఇండస్ట్రీలో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అసలు ఈ బ్యూటీకి క్యాన్సర్ ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె ఎవరు? ప్రస్తుత ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం..

క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ బ్యూటీ..

ఆమె ఎవరో కాదు ఉమా శంకరి. ఈ పేరు గురించి చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. వివి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్, నయనతార, ఛార్మీ ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా లక్ష్మీ లో వెంకటేష్ మొదటి చెల్లిగా నటించిన అమ్మాయి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో సమీర్ భార్యగా తన అద్భుతమైన నటన కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి సుమిత్ర కుమార్తె. 2000 సంవత్సరంలో దర్శకుడు సీమాన్ తెరకెక్కించిన వీరనడై చిత్రం ద్వారా హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సహజ నటన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకు వరుసగా అవకాశాలు లభించాయి. ఇక ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన ఈమె అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలో కూడా యంగ్ సుమిత్ర పాత్రలో కనిపించి మెస్మరైజ్ చేసింది.

ఆస్పత్రి బెడ్ పై నుండి అసలు విషయం..

Advertisement

అలా వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే 2006లో వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమె.. పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికే ప్రాధాన్యతనిస్తూ.. సోషల్ మీడియాకి కూడా దూరమైంది. ఒకప్పుడు వెండితెరపై చిరునవ్వులతో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హాస్పిటల్ బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది ఉమాశంకరి. తాను రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నాను అని తెలిపింది.

కీమో థెరపీ తోపాటు ఇమ్యునో థెరపీ కూడా..

ప్రస్తుతం కీమోథెరపీ తోపాటు ఇమ్యునో థెరపీ చికిత్స కూడా తీసుకుంటున్నానని.. ధైర్యంగా ఈ పోరాటం నుండి బయటపడతానని రాసుకొచ్చింది. ఇకపోతే ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ కూడా హాస్పిటల్ బెడ్ నుండి చాలా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఫోటోని పంచుకోవడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. రెండవ దశ కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Also Read: గృహప్రవేశం చేసిన ‘మనసంతా నువ్వే’ సీరియల్ హీరో యష్.. వీడియో వైరల్!

Tags

Related News

న్యాయం కావాలి.. ఫెడరేషన్ పై నిర్మాతలకు జానీ మాస్టర్ కంప్లైంట్!

బన్నీ క్యాంప్ నుంచీ మరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ వెనుక ఇంత కథ ఉందా?

క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై!

బన్నీ క్యాంప్ నుంచీ మరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ వెనుక ఇంత కథ ఉందా?

జిమ్ వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న అనన్య.. కుర్రకారును రెచ్చగొట్టే గ్లామర్ ట్రీట్!

విజయ్ – త్రిష రిలేషన్ పై మరో జంట షాకింగ్ కామెంట్!

సుడిగాలి సుధీర్…నవ్వుల వెనుక దాగిన కన్నీటి గాథ!

Big Stories

Advertisement
×