Eknath – Harika: గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ‘మనసంతా నువ్వే’ సీరియల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సీరియల్ లో యష్ పాత్రతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఏక్ నాథ్ పరుచూరి. ఈయన గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు సీరియల్స్ చూసే వాళ్ళు మాత్రమే కాదు సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి కూడా ఈయన బాగా సుపరిచితుడే. తన భార్య, ప్రముఖ సీరియల్ నటి హారికతో చేసే రీల్స్ విపరీతంగా పాపులారిటీ సంపాదించుకున్నాయి. పైగా వీరిద్దరి కాంబోలో వచ్చే రీల్స్ కి లక్షల్లో షేర్స్ , లైక్స్ వస్తూ ఉండడం గమనార్హం.
గృహప్రవేశం చేసిన బుల్లితెర జంట..
ఇకపోతే ఈ జంట ‘నేను శైలజ’ సీరియల్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ వీరు.. ఇంట్లో వాళ్లను ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లు దూరంగా ఉన్న వీరు.. మళ్లీ పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్న ఈ జంట ఇటీవల గృహప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని హారిక ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ జంటకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పాలు పొంగిస్తూ..
హారిక షేర్ చేసిన ఈ వీడియోని బట్టి చూస్తే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ని వీరు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పసుపు వస్త్రాలలో లక్ష్మీనారాయణులలా గృహప్రవేశం చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ జంట. ఇద్దరు పాలు పొంగిస్తూ తమ నూతన గృహప్రవేశ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో సిటీ వ్యూ ను అద్భుతంగా చూపిస్తూ రిలీజ్ చేసిన వీడియో ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.
ALSO READ:క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై!
బిగ్ బాస్ సీజన్ 10 లోకి వచ్చే అవకాశం..
ఇదిలా ఉండగా ఈ జంట ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్ బాస్ దశావతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అటు ఏక్ నాథ్ కానీ ఇటు హారిక కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇద్దరిలో ఏ ఒక్కరు హౌస్ లోకి అడుగుపెట్టిన సరే తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో టాప్ పొజిషన్ కి చేరుకోవడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఏక్ నాథ్, హారిక నటిస్తున్న సీరియల్స్..
ఏక్ నాథ్ ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న మనసంతా నువ్వే సీరియల్ లో నటిస్తుండగా.. ఇక అదే ఛానల్లో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్ లో హారిక నటిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link