E-Paper
Advertisement

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్

1. బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య వార్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎన్నికల వేళ బోరబండలో BRS వర్సెస్‌ కాంగ్రెస్‌గా గొడవ చెలరేగింది. బోరబండ కార్పొరేటర్‌పై BRS కార్యకర్త చేయి చేసుకున్నాడు. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి తలెత్తడంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు.

2. సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డిని హత్య చేయడానికి సుపారి గ్యాంగ్‌తో ఆరు లక్షలకు ఒప్పందం చేసుకుంది తల్లి శ్యామలమ్మ. ఎంబీఏ చదువు మానేసి, జులాయిగా తిరుగుతున్న జయప్రకాశ్ రెడ్డి ఆస్తి పంచాలని, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని తరచుగా వేధించడంతో భరించలేక సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించింది.

3. లడ్డూ నెయ్యి ఆరోపణపై లోకేష్‌  సమాధానం చెప్పాలి

తిరుమల లడ్డూ నెయ్యిలో ఘటనలో నిరాధార ఆరోపణ ఎందుకు చేశారో సమాధానం చెప్పాలని నారా లోకేష్‌ను డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ల్యాబ్ నివేదికలు లేకుండా కోట్లాది మంది విశ్వాసంతో ఆడుకున్నందుకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు.

4. తిరుపతిలో రెడ్ అలర్ట్

ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసి బస్టాండ్‌తో పాటు జనసమర్థం ఎక్కువగా ఉండే ఏరియాలో బాంబ్ స్కాడ్, డాగ్‌స్కాడ్ సాయంతో తనిఖీలు చేశారు.

5. కాకినాడ జిల్లాలో రెండు వర్గాల మధ్య భూ వివాదం

కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో రెండు వర్గాల మధ్య భూమి వివాదం చెలరేగింది. సర్వే నెంబర్ 96లో ఫెన్సింగ్ వేస్తుండగా వివాదం తలెత్తింది. ఆ స్థలం మాది అంటూ మరో వర్గం అక్కడికి చేరుకోవడంతో వివాదం మొదలైంది. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

6. మాజీ ఎంపీ పై పార్థసారథి మండిపాటు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హిందూపురం ఎంపీ పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కురుబ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణకు మంత్రి నారా లోకేష్ రావడం జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ విమర్శించారు. తమ ప్రభుత్వం కులాలకు గుర్తింపునిస్తుంటే వైసీపీ విషం కక్కుతోందని అన్నారు.

7. మంత్రి సవిత ఆరోపణ

2019 నుంచి 2024 వరకు ఏపీలో జే ట్యాక్స్ వసూలు చేశారని మంత్రి సవిత ఆరోపించారు. అందుకే పారిశ్రామిక వేత్తలు ఏపీని వదిలివెళ్లిపోయారన్నారు. కానీ చంద్రబాబు సీఎం ఆయ్యాక ఏపీకి వందల సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని..వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. జగన్‌ నియంత పాలనతో విసిగిపోయిన జనం..ఆయనకు కేవలం 11 సీట్లే ఇచ్చారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యే ఏపీకి ఓ టూరిస్టులా వచ్చిపోతున్నారంటూ మండిపడ్డారు.

8. జగన్‌పై విరుచుకుపడ్డ రామానాయుడు

మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ విరుచుకుపడ్డారు. జగన్‌పై పారిశ్రామికవేత్తలు అవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమలకు భరోసా ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.

9. న్యాయవాదిని కారుతో ఢీ కొట్టేందుకు యత్నం

తిరుపతి జిల్లా పుత్తూరు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. విడాకుల కేసులో తన భార్య తరఫున వాదిస్తున్న న్యాయవాది రాజశేఖర్‌ను ఆమె భర్త సాయిప్రసాద్ రెడ్డి కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. న్యాయవాది ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఇన్‌స్పెక్టర్ విచారించి.. 14 రోజులు రిమాండ్‌కు పంపారు.

10. నల్గొండలో రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ బస్సు

నల్గొండ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో దగ్ధం అయింది. హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ అప్రమత్తతతో ఎగ్జిట్ డోర్ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు.

11. మహిళ డెడ్ బాడీ పై బంగారం మాయం

నిజామాబాద్‌లోని ప్రగతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ డెడ్ బాడీ నుంచి 18 గ్రాముల బంగారం మాయం చేశారు. దీంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగవ్వ. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ.. మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బందే బంగారం అపహరించారని.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12. ఇంటికి వచ్చే బిడ్డా అంటూ.. హిడ్మాకు తల్లి పిలుపు

మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మాను ఇంటికి రావాలని పిలుపు నిచ్చారు హిడ్మా తల్లి. ఎక్కడ ఉన్నావు బిడ్డా, ఇంటికొచ్చేయి అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడ మనం కష్టపడి పనిచేసుకుందాం, ప్రజలతో కలిసి సద్భావనగా జీవిద్దాం అంటూ ఇంటికి రావాలని కోరారు హిడ్మా తల్లి.

13. ద్విచక్ర వాహనాల ముఠా గుట్టురట్టు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వరుస దొంగతనాలు చేస్తోన్న ద్విచక్ర వాహనాల ముఠా గుట్టు రట్టయింది. డీఎస్పీ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు 15 లక్షల విలువైన 20 వాహనాలను స్వాధీనం చేసుకుని, దొంగతనాలకు పాల్పడిన నలుగురు మైనర్లతో సహా 8 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.

14. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఆదినారాయణ ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాచమల్లు ఒక బచ్చా అని వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర అభివృద్ధిని జగన్ పట్టించుకోకపోతే తాము చేస్తున్నామని పేర్కొన్నారు. దమ్ముంటే రాచమల్లు చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

15. ప్లాట్ సెటిల్‌మెంట్‌కు సుపారీ ఇచ్చిన బాలరాజు

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్లాట్ సెటిల్‌మెంట్‌కు పెద్దమనిషి ముద్దం బాలరాజు సుపారీ ఇచ్చి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాలరాజు 1.03 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో బాధితుడు విక్రమ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

16.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ పై సీఐడీ విచారణ ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తెలంగాణ సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్‌ రాజ్‌లను విచారణకు హాజరుకావాలని సీఐడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ పలువురిని ప్రశ్నించింది.

17. 23 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్ తొలి సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్‌కు 23 ఏళ్లు పూర్తయ్యాయి. మాస్ లుక్ ఉన్న కొత్త హీరో కోసం చూస్తున్నప్పుడు ప్రభాస్‌ను చూసి వెంటనే ఎంపిక చేశానని దర్శకుడు జయంత్ పరాన్జీ తెలిపారు. శిక్షణ పూర్తి కాకముందే ప్రభాస్ తనను నమ్మి సినిమాకు అంగీకరించారని వెల్లడించారు.

18. మూడు రోజుల పాటు ఎర్రకోట బంద్

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్రకోటను బంద్ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు విజిట‌ర్స్‌కు ఎర్రకోట బంద్ ఉంటుంద‌ని ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. కారు బాంబు పేలుడు నేపథ్యంలో విచారణకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

19. MIకి రోహిత్ గుడ్‌ బాయ్.. క్లారిటీ ఇదే

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌పై రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌ను వీడుతారనే వదంతులకు ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా పోస్ట్‌తో చెక్ పెట్టింది. రోహిత్ తదుపరి సీజన్‌లోనూ కీలకపాత్ర పోషిస్తాడని MI భరోసా ఇచ్చింది.

20. ఇంజెక్షన్ల వాడుతున్నారనే వార్తలపై స్పందించిన తమన్నా

బరువు తగ్గడం కోసం ఒజెంపిక్ ఇంజెక్షన్లు వాడుతున్నారనే వార్తలపై నటి తమన్నా స్పందించారు. 15 ఏళ్ల వయసు నుంచే నటిస్తున్నానని, కెమెరా ముందు దాచడానికి ఏమీ లేదని ఆమె తెలిపారు. టీనేజీలో స్లిమ్‌గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నాననుకుంటున్నానని… ప్రతి ఐదేళ్లకు మహిళల శరీరాకృతిలో మార్పులు సహజమని చెబుతూ వదంతులకు చెక్ పెట్టారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×