BigTV English

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 అక్కడికక్కడే మృతి చెందారు.. అలాగే శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఐదుగురు 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.


ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా కమిషనర్‌తో మాట్లాడి, అన్ని సాధ్యమైన సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తక్షణ రెస్క్యూ, రిలీఫ్ చర్యలను ఆదేశించారు.

అయితే భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ రాజ్‌గఢ్ ప్రాంతంలోని గడ్‌గ్రామ్ పాకెట్‌లో ఇళ్లను దెబ్బతీశాయి. అక్కడి ప్రాంతంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇది విస్తృతమైన నష్టానికి దారితీసింది. జమ్ము-శ్రీనగర్ నేషనల్ హైవే ఐదు రోజులుగా మూసివేయబడింది. దీంతో ఉధంపూర్ జిల్లాలోని జఖేని, చెనాని మధ్య కొండచరియల కారణంగా 2,000 కంటే ఎక్కువ వాహనాలు చిక్కుకుపోయాయి. అంతేకాకుండా జమ్ము ప్రాంతంలో తొమ్మిది ఇంటర్-డిస్ట్రిక్ట్ రోడ్లు మూసివేయబడ్డాయి, డజన్ల కొద్దీ గ్రామాలు కట్ ఆఫ్ అయ్యాయి.


Also Read: అయ్యబాబోయ్.. బంగారం ధరలు ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి?

గత రెండు వారాల్లో115 మరణాలు..
గత రెండు వారాల్లో, తీవ్రమైన వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు జమ్ము ప్రాంతంలో గణనీయమైన వినాశనానికి కారణమయ్యాయి. మొత్తం 115 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. ప్రధానంగా యాత్రికులు, కిష్ట్వార్‌లోని మచైల్ మాత యాత్రలో 65 మరణాలు, జమ్ములోని మాత వైష్ణోదేవి దేవాలయం సమీపంలో 30 మరణాలు, రాంబాన్ , రీసీలలోని సంఘటనలు 11 మంది మరణాలకు దారితీశాయి. ఈ ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు ల్యాండ్‌స్లైడ్-ప్రోన్ ప్రాంతాలలో ప్రయాణించకుండా ఉండాలని, నదులు, నాలాల నుండి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో 112 సంప్రదించండని తెలిపారు.

Related News

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Los Angeles News: అందరూ చూస్తుండగా.. భారతీయుడిని కాల్చి చంపారు.. ఇదిగో వీడియో!

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Big Stories

×