BigTV English

Om Raut: ఆ బయోపిక్ కోసం ధనుష్ ను మించిన నటుడు లేడా…నెటిజన్స్ రియాక్షన్ ఇదే!

Om Raut: ఆ బయోపిక్ కోసం ధనుష్ ను మించిన నటుడు లేడా…నెటిజన్స్ రియాక్షన్ ఇదే!

Om Raut: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ సినిమాలు(Biopic Movies) ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి బయోపిక్ సినిమాలతో పాటు క్రీడారంగానికి రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా గొప్ప వ్యక్తుల జీవిత కథను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి బయోపిక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ప్రముఖ శాస్త్రవేత్త, భారత దేశ 11 వ రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam)గారి బయోపిక్ సినిమా చేయాలని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.


అబ్దుల్ కలాం బయోపిక్ చిత్రం…

ఇక ఈ బయోపిక్ సినిమాకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut)ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అబ్దుల్ కలాం గారి బయోపిక్ సినిమాలో నటించాలి అంటే కేవలం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Danush) కి మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. అబ్దుల్ కలాం గారి పాత్రలో ధనుష్ కంటే గొప్పగా నటించే హీరోలు ఇప్పటివరకు నాకు దొరకలేదు అంటూ ధనుష్ గురించి డైరెక్టర్ ఓం రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.


ఆది పురుష్ విషయంలో విమర్శలు…

ధనుష్ అబ్దుల్ కలాం గారి బయోపిక్ సినిమాకు సరిగ్గా సరిపోతారంటూ మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ అసలు సమస్య మీరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా కొనసాగుతున్న ఓం రౌత్ ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా ఆది పురుష్ (Aadi Purush)సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రభాస్ నటన పై ఆయన లుక్ పరంగా ఎన్నో విమర్శలు వచ్చాయి. రామాయణాన్ని అవమానిస్తూ ఓం రౌత్ ఈ సినిమా చేశారు అంటూ డైరెక్టర్ పై కూడా విమర్శలు కురిపించారు.

కుబేరతో హిట్ కొట్టిన ధనుష్..

ఇక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కార్టూన్ ఛానల్ లో కంటే కూడా ఘోరంగా ఉందని అప్పట్లో ఈయనపై భారీగా విమర్శలు వచ్చాయి. ఇప్పటికి కూడా పలు సందర్భాలలో ఆది పురుష్ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు ఈయనపై విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలలో నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల కాలంలో ధనుష్ పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఇడ్లీ కడై అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Sandeep Reddy Vanga: ప్రభాస్ కోసం రామ్ చరణ్  స్టైలిస్ట్ .. గట్టిగనే ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Related News

Pawan Kalyan : పబ్లిక్ మీటింగ్ విడిచి… అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కళ్యాణ్

Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Big Stories

×