BigTV English

OG Bookings : ఓజీ సునామీ… రిలీజ్‌కు ముందే పుష్ప 2 రికార్డులు బ్రేక్

OG Bookings : ఓజీ సునామీ… రిలీజ్‌కు ముందే పుష్ప 2 రికార్డులు బ్రేక్

OG Bookings : పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు అంత సిద్దంగా ఉంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టారు. రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసారు. రిలీజ్ అయినా వెంటనే అవి ఇంటర్నెట్ లో సంచలన రికార్డులు సృష్టించాయి. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను మళ్లీ స్టార్ పవర్‌గా చూస్తామని అభిమానులు సినిమా రిలీజ్ డే కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.


తాజా సమాచారం ప్రకారం US లో OG సినిమా టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలు పెట్టి మూడు రోజులు కాకముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టిందని అధికారిక ప్రకటన వచ్చింది. కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలు కూడా ఓవర్సీస్‌లో ఇంత తక్కువ సమయంలో అంత ఫ్రీ బుకింగ్స్ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి.

దీనిబట్టి చూస్తే OG సినిమా కి ఉన్న క్రేజ్ మన ఊహించినదానికంటే ఎక్కువే ఉన్నటు అర్ధమవుతుంది. ఇది ఇలానే కొనసాగితే, OG ఓపెనింగ్ డే కలెక్షన్లు ఏకంగా 200 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే OG బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవనుంది అని ట్రేడ్ వర్గాలు, సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ డేట్ కి ఇంకా ఇరవైఐదు రోజులు ఉండగానే ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అంటే రాన్నున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఓపెనింగ్ డే రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.


మళ్ళి వీరమల్లు ని గుర్తు చేస్తే?

ఇది అంత బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అండ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది, అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగంలో రోజుకో మెట్టు ఎదుగుతూ వస్తున్నారు. కానీ, ఇటీవలే హరి హర వీరమల్లు సినిమా బెడిసి కొట్టింది. భారీ హైప్‌తో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని రెండో రోజు నుంచి డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం తర్వాత ఫ్యాన్స్ సినిమాపై ఎక్కువ హైప్ క్రియేట్ చేయొద్దు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రియాంక పాత్ర చనిపోతుందా?

OG హైప్ గురించి కొంచం పక్కన పెడితే, ఈ సినిమా మీద ఇంకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమా కథను ఫాన్స్ ముందే అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

దాని ప్రకరం.. సినిమాలో ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్, కన్మణి పాత్రలో ప్రియాంక కనిపించబోతున్నారు. మూవీలో వీరు ప్రేమికులు. అయితే ఓజాస్ తన గతంలో చేసిన అండర్వరల్డ్ క్రైమ్ ని వదిలేసి తన చెంత చేరుతాడు. కానీ అతని శత్రువులు మళ్ళి దాడి చేస్తే ఆ కాల్పుల్లో కన్మణి మరణిస్తుంది. తన ప్రియురాలిని చంపినందుకు ఓజాస్ తన పగ తీర్చుకోవడానికి మళ్ళి అండర్వరల్డ్ కి తిరిగి వస్తాడు. ఇదే సినిమా మూల కథ కొంత మంది ఫాన్స్ ఈ థియరీని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది సినిమా రిలీజ్ అయ్యాకే మనకు తెలుస్తుంది.

Related News

Sandeep Reddy Vanga: ప్రభాస్ కోసం రామ్ చరణ్  స్టైలిస్ట్ .. గట్టిగనే ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Anjali Raghav: హీరో అసభ్య ప్రవర్తన.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న భోజ్ పూరి నటి అంజలి

Manoj Bajpayee: ఓటీటీ నాకు దక్కిన వరం.. ఫ్యామిలీ మెన్ నటుడు కామెంట్స్ వైరల్!

Mana Shankara Varaprasad Garu: మన శివశంకర వరప్రసాద్ రిలీజ్ డేట్ ఫిక్స్, రిస్క్ లో పడ్డ నవీన్ పోలిశెట్టి

Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు

Zainab Ravdjee: మావయ్యను డాడి చేసేసింది… అక్కినేని కొత్త కోడలపై అప్పుడే ట్రోల్స్

Big Stories

×