BigTV English

Rashid Khan : రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం… డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ప్లేయర్ల హడావిడి

Rashid Khan : రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం… డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ప్లేయర్ల హడావిడి
Advertisement

Rashid Khan :   ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పాకిస్తాన్,  యూఏఈ, అప్గానిస్తాన్ వంటి జట్లు దుబాయ్ కి చేరుకొని అక్కడ నామమాత్రపు మ్యాచ్ లను ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్ఘానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రషీద్ ఖాన్ పెద్దన్న హాజీ అబ్దుల్ హలీం షిన్వారీ ఇటీవలే తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే అప్ఘానిస్తాన్ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా సంతాపం తెలిపారు. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది రషీద్ ఖాన్ ను ఓదార్చాడు. మరోవైపు అప్ఘానిస్తాన్ ఆటగాడు ఇబ్రాహీం జాద్రాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ” అన్న అంటే కుటుంబానికి తండ్రి లాంటి వాడుఅని.. రషీద్ ఖాన్ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజియూన్” అని పోస్ట్ చేశాడు.


Also Read :  Asia Cup 2025 : దుబాయ్ లో ఎండలు.. ఆసియా కప్ 2025 టైమింగ్స్ చేంజ్… కొత్త షెడ్యూల్ ఇదే!

పాక్ ప్లేయర్స్ హడావుడి.. 


మరోవైపు మాజీ కెప్టెన్ అస్గర్ అప్ఘాన్ కూడా స్పందిస్తూ.. “అల్లాహ్ ఆయనకు జన్నత్ అల్-ఫిర్దౌస్ ప్రసాదించి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి” అని ప్రార్థించారు. ఇక ఈ విషాద ఘటన చోటు చేసుకున్న రోజే పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మధ్య  మ్యాచ్ జరిగింది. ట్రై నేషన్ టీ-20 సిరీస్ తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు రషీద్ ఖాన్ పెద్దన్నకు గౌరవప్రదంగా నివాళి అర్పించింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు మామూలు హడావిడి చేయడం లేదు కదా అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ వర్సెస్ అప్ఘానిస్తాన్ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 182 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ప్రారంభంలో పాకిస్తాన్ జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయినప్పటికీ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వన్ మ్యాన్ షో తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

పోరాడి ఓడిన అప్గానిస్తాన్.. 

అదేవిధంగా సల్మాన్ అలీ అఘా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సల్మాన్ అఘా 36 బంతుల్లో 53 పరుగులు చేయగా.. చివర్లో మహ్మద్ నవాజ్ 11 బంతుల్లో 21 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ జట్టు ఇచ్చిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అప్గానిస్తాన్ జట్టు దారుణంగా విఫలం చెందింది. పాక్ పేసర్ షాహీన్ ఫ్రిది ఓపెనర్ ఇబ్రాహీం జాద్రాన్ ను ఔట్ చేయగా.. మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ 38 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకానొక దశలో 93/2 గా ఉన్న అప్గానిస్తాన్ జట్టు 97/7 పరుగులు చేసి కుప్ప కూలిపోయింది. హారిష్ రౌఫ్ డబుల్ వికెట్ మేడిన్ తో మ్యాచ్ పాక్ వైపునకు మళ్లింది. చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ 16 బంతుల్లో 39 పరుతులు చేసినా అప్పటి మ్యాచ్ చేజారిపోయింది. 19.5 ఓవర్లకు 143 పరుగులు చేసి ఆలౌట్ అయింది అప్గానిస్తాన్ జట్టు. దీంతో పాకిస్తాన్ జట్టు 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related News

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

IND vs AUS: RO-KO అంటూ జాకీలు పెట్టి లేపారు..కంగారుల ముందు మాత్రం తోక ముడిచారు !

IND VS AUS 1st ODI: టాస్ గెలిచిన ఆసీస్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..జ‌ట్ల వివ‌రాలు ఇవే

INDW vs ENGW: ఇవాళ ఇంగ్లండ్ తో డూ ఆర్ డై.. ఓడితే టీమిండియా ఇంటికేనా ?

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌.. టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే

Big Stories

×