Pawan Singh Wife Emotional Note: ప్రముఖ సూపర్ స్టార్ పవన్ సింగ్ ప్రస్తుతం వివాదంలో నిలిచాడు. తన సహా నటి అంజలి రాఘవ్ నడుము తాకడంతో ఆయనపై నటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చేసిన పనికి నటి అంజలి ఇచ్చిన రియాక్షన్ అందరిని షాక్ కి గురి చేసింది. సదరు నటుడిపై సీరియస్ అవ్వాల్సిందిపోయి.. నవ్వడం ఏంటని అంతా ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇక స్టేజ్‌పై అందరి ముందే నటి అంజలి నడుము తాకడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ వ్యవహరంలో సదరు నటికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఈ సంఘటనపై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలను వస్తున్నాయి.
పవన్ సింగ్ భార్య భావోద్వేగం
చాలామంది పవన్ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంత వరకు పవన్ సింగ్ కానీ, ఆయన టీం కానీ స్పందించలేదు. ఈ క్రమంలో హీరో పవన్ సింగ్ భార్య జ్యోతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో ఆమె తన భర్త, హీరో పవన్ సింగ్‌నే నిందిస్తున్నట్టుగా ఉంది. అంతేకాదు వీరి వైవాహిక బంధంలో కలతలు ఉన్నట్టు వ్యక్తం అవుతోంది. పవన్ సింగ్ తన నుదుటిన సిందూరం పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. “మా కుటుంబం, రాజకీయ అంశమైన ఆయనను కలిసేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. పదేళ్లుగా నేను ఎంతో మానసికి ఒత్తడికి లోనవుతున్న. లక్నోలోని డెహ్రిలో జరిగిన ఛత్ ఉత్సవాల సందర్భంగా మిమ్మల్ని(భర్త పవన్ సింగ్) కలవడానికి ఎంతో ప్రయత్నించాను.
ఏడేళ్లుగా నరకం చూస్తున్నా..
కానీ, మీరు నన్ను కలవడానికి కూడా నిరాకరించారు. చాలా నెలలుగా మీతో మాట్లాడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, మీరు కనీసం నాతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించడం లేదు. మీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఏళ్లుగా నేను ఈ బాధను భరిస్తున్నాను. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న. ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. కానీ, ఇది నా తల్లిదండ్రులకు కళంకంగా తెస్తుంది. అందుకే ఆగిపోతున్న. అయినప్పటికీ భార్య నా విధిని నేను అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. అయినా మీరు నన్ను భార్యగా కాదు.. సాటి వ్యక్తిగా కూడా చూడటం లేదు. మీరు మీ రాజకీయ ప్రత్యుర్థుల కూడా క్షమించి ఆలింగనం చూసుకున్నారు. కానీ, సొంత భార్య అయిన నా పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు. ఇది నన్ను ఎంతో బాధిస్తోంది. నా బాధను పంచుకున్నప్పుడు, నా స్వంత కుటుంబం నన్ను కూడా అంగీకరించదు. దాదాపు ఏడేళ్లుగా నేను మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను.
భార్యతో మనస్పర్థలు..
కానీ, కనీసం ఆలోచన కూడా మీరు చేయట్లేదు. ఏడేళ్లుగా నేను ఈ బాధను అనుభవిస్తున్నా. చివరికి నా జీవితంపైనే విరక్తి కలుగుతోంది. నన్ను నేను ద్వేషించుకోవడం ప్రారంభించాను. దయచేసి ఒక్కసారి నాతో మాట్లాడండి. నా కాల్స్, మెసేజ్‌కి రిప్లై ఇవ్వండి . ఒక్కసారైనా నా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి” అంటూ పవన్ సింగ్ భార్య జ్యోతి సోషల్ మీడియాలో వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాసిన లేఖ చూస్తుంటే వీరిద్దరు విడివిడిగా ఉన్నారని అర్థమైపోతుంది. పవన్ సింగ్ తన భార్య జ్యోతిని దూరం పెడుతున్నారని, ప్రస్తుతం తనతో కలిసి ఉండటం లేదని విషయం బయటపడింది. కాగా 2018లో పవన్ సింగ్ జ్యోతిని పెళ్లి చేసుకున్నారు. ఇది ఆయనకు రెండో వివాహమనే విషయం తెలిసిందే. మొదటి భార్య ఆత్మహత్య చేసుకోని చనిపోయిన తర్వాత అతడు జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల రెండో భార్యతోనూ కలతలు మొదలయ్యాయి. ఇటీవల వీరి ఫోన్ కాల్ రీకార్డు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి పవన్ సింగ్ వ్యక్తిగత విషయం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్న క్రమంలో తాజాగా నటి నడుముని తాకిన వీడియో ఆయన మరోసారి మీడియాల్లో నిలిచాడు.