BigTV English

Yellow alert: రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఉరుములు, మెరుపులతో..!

Yellow alert: రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఉరుములు, మెరుపులతో..!

Yellow alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగస్టు నెల మొదటి వారం వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది.


రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని.. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. నైరుతి వైపునకు వంగి ఒందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవాళ ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి,  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.


ఆదివారం..

ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

సోమవారం (సెప్టెంబర్ 1)

సోమవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించింది.

మంగళవారం.. (సెప్టెంబర్ 2)

మంగళవారం రోజున ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు..

ALSO READ: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

బుధవారం (సెప్టెంబర్ 3)

బుధవారం రోజున ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.

ALSO READ: Minister Komati reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే.. ఆ తప్పుకు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related News

Kamareddy: కామారెడ్డిలో భారీ వరదలు.. ప్రజల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇదంతా: ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి

BRS vs Congress: బీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ఎస్ బాయ్‌కాట్.. మంత్రి తుమ్మల ఫైర్..

Minister Komati reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే.. ఆ తప్పుకు ఒప్పుకున్నట్టే: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

Big Stories

×