Haryana Mithai Ghar:హైదరాబాద్ అనగానే ఘుమఘుమలాడే బిర్యానీ గుర్తుకు వస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు బిర్యానీ వాసనలతో ఆహా అనిపిస్తాయి. బిర్యానీ తర్వాత అంతే స్థాయిలు గుర్తింపు తెచ్చుకున్నాయి మిఠాయి దుకాణాలు. నగరంలో హమీదీ కన్ఫెక్షనర్స్, మున్షి నాన్, నిమ్రా కేఫ్, సుభాన్ బేకరీ లాంటి ఎన్నో అద్భుతమైన స్వీట్ సెంటర్లు ఉన్నాయి. ఈ మిఠాయి దుకాణాలు శతాబ్దానికి పైగా ఉన్న తీపి వంటకాల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. హంగూ ఆర్భాటాలు లేకున్నా తరతరాలుగా తమ సంప్రాదాయాన్ని కొనసాగిస్తున్నాయి. తమ కస్టమర్లకు ఇప్పటికీ చక్కటి మిఠాయీలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి హర్యానా మిఠాయి ఘర్. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే..
125 ఏళ్ల చరిత్ర హర్యానా మిఠాయి ఘర్ సొంతం
హైదరాబాద్ ఓ ఏర్పాటు అయిన తొలినాళ్లలోని మిఠాయి దుకాణాల్లో ఇదీ ఒకటి. చార్మినార్ సమీపంలోని ఘాన్సీ బజార్ లో ఉంటుంది. 125 ఏళ్లకు పైగా పురాతనమైన దుకాణం.. పాత బస్తీలో తెలియని వాళ్లంటూ ఉండరు. 19వ శతాబ్దం నుంచి వారసత్వంగా వస్తున్న హర్యాన మిఠాయి ఘర్, మొదట బల్వీర్జీ పూరి వాలే అనే పేరుతో పిలువబడేది. ఇది హైదరాబాద్ లో ఒక స్వీట్ షాప్ మాత్రమే కాదు. ఇది ఒక జీవన చరిత్ర. నిజాం ఆధీనంలో ఉన్న నగరానికి ఉత్తర భారతదేశ రుచులను తీసుకువచ్చిన మొదటి దుకాణం ఇదే. హర్యానా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం దీనిని ప్రారంభించింది. ప్రస్తుతం 7వ తరం కుటుంబ సభ్యులు ఈ దుకాణాన్ని నడుపుతున్నారు. యజమానులు మారినప్పటికీ, తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు అదే మెనూ కొనసాగుతుంది. స్వచ్ఛమైన నెయ్యి, సాంప్రదాయ పద్ధతుల ద్వారా వీటిని తయారు చేస్తున్నారు. వారు తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ఏంటీ.. ఈ కండోమ్ 200 ఏళ్ల నాటిదా? అస్సలు ఊహించి ఉండరు!
హర్యానా మిఠాయి ఘర్ ప్రత్యేక వంటకాలు
ఇక ఈ స్వీట్ సెంటర్ లో ఉండే ప్రత్యేక రుచులు ఎంతగానో నోరూరించేస్తాయి. చక్కటి నెయ్యి తో తయారు చేసిన పూరి సబ్జీతో ఆహా అనిపిస్తుంది. హర్యానా మిఠాయి ఘర్ స్పెషల్ డిష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లచ్చా కలకంద్ కూడా ఇక్కడ ఎంతో పాపులర్. బత్కా పెడా, గులాబ్ జామున్, రసగుల్లా, గజర్ కా హల్వా, సమోసా, కచోరి, బర్ఫీ లాంటి క్లాసిక్ వంటకాలు బాగా పాపులర్. మెనూ పెద్దగా లేనప్పటికీ, వారు అందించే కొన్ని డిషెస్ కస్టమర్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. తరచుగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇక్కడ వంటకాలను ఆస్వాదిస్తారు. చాలా మందికి వీకెండ్ అడ్డాగా మారిపోతుంది.
Read Also: ఇండియాలో ఇప్పటికీ ఆ రైల్వే లైన్ బ్రిటిషర్లదేనట, ఏటా రాయల్టీ కూడా కట్టించుకుంటున్నారు!