BigTV English

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం
Advertisement

Indian Railway Jobs:  రైల్వే ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఆర్ఆర్‌సీ వెస్టర్న్ రైల్వేలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన డేట్స్, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


నోట్: ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రారంభం..

ఆర్ఆర్‌సీ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్ పుర్ లోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 2865 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 30వ తేది నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2865

ఆర్ఆర్‌సీ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే జబల్ పుర్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

డివిజన్ల వారీగా వెకెన్సీలను చూస్తే..

జేబీపీ డివిజన్: 1136 పోస్టులు
బీపీఎల్ డివిజన్: 558 పోస్టులు
కోటా డివిజన్: 865 పోస్టులు సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌ డివిజన్‌: 136 పోస్టులు
డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా డివిజన్‌: 151 పోస్టులు
హెచ్‌క్యూ/జేబీపీ: 19 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన డేట్స్..

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 30

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.140 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు 40 ఫీజ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://wcr.indianrailways.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2865

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29

Related News

JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!

TGCAB Staff Assistant Posts: టీజీ క్యాబ్ బ్యాంకుల్లో 225 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత గల వారికి గుడ్ ఛాన్స్

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

NER Jobs: రైల్వేలో 1104 అప్రెంటీస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ONGC Jobs: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఓఎన్‌జీసీలో 2623 ఉద్యోగాలు.. నెలకు రూ.12,300 స్టైఫండ్

EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే

Big Stories

×