Actress Anjali Raghav Reacts on Viral Video: ఓ స్టార్ హీరో నటి నడుము తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు హీరో నడుము తాకిన ఆమె నవ్వుతూ ఇచ్చిన రియాక్షన్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సదరు నటి స్పందించాలని ఫ్యాన్స్ నుంచి ఆమె కుప్పలు కుప్పలుగా మెసేజ్‌లు రావడంతో చివరికి నటి ఈ సంఘటనపై స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది.
నటిని అసభ్యకరంగా తాకిన హీరో
ఇంతకి అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ నటుడు, భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భోజ్‌పూరి పాటలు ఫాలోఅ అయ్యేవారికి ఈయన బాగా సుపరిచితం. భోజ్‌పూరి సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ తో ఆయన మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల ఆయన అతడు నటించిన ‘సయ్యాసే సేవాకరే’ అనే పాటతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. యూట్యూబ్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్, వ్యూస్ సంపాదించుకుంది. ఇందులో పవన్ సింగ్ సరసన నటి అంజలి రాఘవ్ నటించింది. పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పాట సక్సెస్ అయిన సందర్భంగా లక్నో లో గ్రాండ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటి అంజలి మాట్లాడుతుండగా.. పక్కనే ఉన్న పవన్ సింగ్ ఆమె నడుమును తాకాడు.
ఒక్కసారి కాదు రెండు సార్లు ఆమె నడుము తాకి శుభ్రం చేస్తున్నట్టు చేశారు. అలా రెండు పవన్ సింగ్ అంజలి నడుము తాకుతూ చేయితో నిమిడాడు. మొదటిసారి అంజలి షాకైంది. ఇక రెండో సారి ఏదో ఉంది అన్నట్టు చూపిస్తూ తాకడంతో ఆమె నవ్వింది. హీరో తీరుకు ఆమె అసౌకర్యం చెందుతూనే ముఖంపై చిరు నవ్వు చూపించింది. ఇది వైరల్ కావడంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయమై పవన్ సింగ్ ఆమెకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇక ఈ వ్యవహరంపై నటి అంజలి కూడా స్పందించాలని ఆమె ఫ్యాన్స్ డిమాండ్స్ వస్తున్నాయి. దీంతో నటి మాట్లాడుతున్న వీడియోని షేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మూవీ ఈవెంట్‌లో హీరో పవన్ సింగ్ చేసిన దానికి నేను షాక్ అయ్యాను. ఈ వీడియో వైరల్ అయినప్పటి నుంచి నాకు ప్రెజర్ ఎక్కువైంది. చాలా ఆందోళనగా ఉంది. దీనిపై స్పందించమని అభిమానులు, నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ఇండస్ట్రీని వదిలేస్తున్నా..
ఆయన అసభ్యంకంగా తాకినప్పుడు.. కొట్టడం లేదా సీరియస్ అవ్వడం చేయాలి. కానీ, మీరు ఎందుకు నవ్వారు అని ప్రశ్నిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో నాకు చాలా మెసేజస్ వస్తున్నాయి. దీని వల్ల నాకు ఒత్తిడి పెరుగుతోంది. అసలు అక్కడ ఏం జరిగింది.. ఎందుకు అలా చేశారనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. చీరలో నేను కాస్తా అసౌకర్యంగా ఉన్నాను. నా బ్లౌజ్‌కి ఏందో వేలాడుతూ ఉన్నట్టు కనిపించడం ఆయన దాన్ని తీసేసే ప్రయత్నం చేశారనుకుంటున్నారు. ఏదేమైనా ఇలా పరిస్థితి ఎదురవ్వడం నాకు చాలా అసభ్యకరంగా అనిపిస్తోంది. ఇది నాకు, నా కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక నేను సినిమాల్లో నటించను. భోజ్‌పూరి ఇండస్ట్రీని వదిలేయాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ భోజ్‌పూరి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.