Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి(Sandeep Reddy) అనంతరం అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తూ అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం యానిమల్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి త్వరలోనే ప్రభాస్(Prabhas) తో కలిసి స్పిరిట్ (Spirit)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో స్పిరిట్..
సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటేనే సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి భారీగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈయన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్(Aalim Hakim) ను కలిశారు. ఈయన పెద్ద సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)పెద్ది సినిమాకు(Peddi Movie ) కూడా స్టైలిష్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి ఆలిమ్ హకీమ్ ను సంప్రదించడమే కాకుండా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కోసం ఈయనని రంగంలోకి దింపినట్టు వెల్లడించారు.
ప్రభాస్ కోసం ఆలిమ్ హకీమ్..
రామ్ చరణ్ పెద్ది సినిమాలోని లుక్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా రాంచరణ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రభాస్ కి స్టైలిష్ గా మారబోతున్నారనే విషయం తెలియడంతో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే కుతుహలం అభిమానులలో బాగా పెరిగిపోయింది. ఇలా సినిమాకు సంబంధించి ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ సందీప్ రెడ్డి సినిమా పై భారీగానే అంచనాలను పెంచేస్తున్నారు.
నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్..
ఇక సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటి త్రిప్తి దిమ్రి నటించబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకు ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనేని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో సందీప్ రెడ్డి త్రిప్తిని ఎంపిక చేశారు. ఈమె ఇదివరకే సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమాలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న త్రిప్తి ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.
Also Read: Manoj Bajpayee: ఓటీటీ నాకు దక్కిన వరం.. ఫ్యామిలీ మెన్ నటుడు కామెంట్స్ వైరల్!