E-Paper
Advertisement

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత
Advertisement

Assam Floods: అస్సాంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వరదల బారిని పడ్డారు. ఈ వరదల ధాటికి కజిరంగ పార్కులో 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఈ ఉదయం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. కజిరంగ పార్కులోని వరదలో ఓ ఖడ్గ మృగం చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వీడియో షేర్ చేశారు. దానిని వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరితో పాటు వన్యప్రాణుల ప్రాణాలు ప్రమాదాల్లో పడ్డాయని అన్నారు.

Advertisement

ఇక ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు, రెండు సాంబర్, ఒక మకాకు, ఇక ఒట్టర్ మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకు 97 వన్యప్రాణులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 25 వన్యప్రాణులు మెడికల్ కేర్‌లో ఉన్నాయని.. 52 వన్యప్రాణులను ట్రీట్‌మెంట్ తర్వాత విడిచిపెట్టామని అధికారులు తెలిపారు.

Advertisement

2017లో వరదల వల్ల దాదాపు 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి 24 గంటలు పని చేస్తున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం అన్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×