E-Paper
Advertisement

Sarath Kumar: కూతురు పెళ్లికి రూ. 200 కోట్ల ఖర్చు.. మూసుకొని గమ్మున ఉండాలి అన్న శరత్ కుమార్

Sarath Kumar: కూతురు పెళ్లికి రూ. 200 కోట్ల ఖర్చు.. మూసుకొని గమ్మున ఉండాలి అన్న శరత్ కుమార్
Advertisement

Sarath Kumar: కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాల్లో నటించి మెప్పించిన శరత్ కుమార్.. ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. ఇక శరత్ కుమార్ నటవారసురాలిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్.

అందరిలా హీరోయిన్ కాకుండా విలన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బొద్దుగా ఉన్న ఈ భామ సన్నబడి హీరోయిన్ గా మారింది. ఇక జూలై 2 న వరలక్ష్మీ తాను ప్రేమించిన నికోలాయ్ సచ్ దేవ్ ను వివాహామాడిన విషయం తెల్సిందే. ఈ పెళ్లిని శరత్ కుమార్ ఎంతో గ్రాండ్ గా జరిపించాడు.

Advertisement

ప్రస్తుతం ఈ జంట హనీమూన్ లో బిజీగా ఉంది. అయితే ఈ జంట పెళ్ళికి శరత్ కుమార్ కోట్లల్లో ఖర్చుచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నికోలాయ్ కు కోట్ల ఆస్తి ఉందని, అతని.. వరూకు కానుకగా.. రూ.200 కోట్ల విలువ చేసే డైమండ్ చీర, ఆభరణాలు గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటిపై శరత్ కుమార్ స్పందించాడు. అల్లుడు పెట్టిన గిఫ్ట్ ల గురించి కాకుండా పెళ్లి ఖర్చు గురించి మాట్లాడాడు. అలాంటి వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు.

“అసలు అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉందో నాకే అర్థం కావడం లేదు. ఇలాంటి వార్తలు పూర్తిగాఅసత్యం. ఏమీ తెలియనప్పుడు గమ్ముగా ఉండాలి తప్ప ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు. అయినా పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి? ఒక సాధారణ వక్తిలానే నా కుమార్తె పెళ్లి నేను జరిపించాను. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా.. ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ వార్తలో నిజం లేదని తెలిసిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×