E-Paper
Advertisement

15 కేజీ బంగారంతో చిక్కిన మహిళ, మాఫియాతో లింకులు.. సరిహద్దులో పసిడి పంట

15 కేజీ బంగారంతో చిక్కిన మహిళ, మాఫియాతో లింకులు.. సరిహద్దులో పసిడి పంట
Advertisement

Gold Smuggling: దేశంలో గోల్డ్ మాఫియా రంగంలోకి దిగిందా? సరిహద్దుల ద్వారా ఇండియాలోకి బంగారం వస్తుందా? ఇండియా మీదుగా విదేశాలకు బంగారం ఎగుమతి చేస్తున్నారా? ఓ మహిళ నుంచి 15 కేజీల బంగారం ఎలా దొరికింది? అధికారులు రంగంలోకి తీగలాగితే డొంక కదులుతోంది? అసలు ఏం జరుగుతోంది?

 

సరిహద్దులో గోల్డ్ మాఫియా, చిక్కిన మహిళ నుంచి 15 కేజీల బంగారం

Advertisement

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో భారీగా బంగారం చిక్కింది. ఓ మహిళ అక్రమంగా రవాణా చేస్తున్న 15.607 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు బీఎస్‌ఎఫ్‌ అధికారులు. మార్కెట్లో దాని విలువ రూ.24.95 కోట్లు. పశ్చిమ బెంగాల్‌ నాదియా జిల్లాలో బన్‌పూర్‌ సరిహద్దు వద్ద  బంగారాన్ని సీజ్‌ చేశారు. ఓ మహిళ అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో సంచరించడాన్ని గుర్తించారు బీఎస్ఎఫ్ 32వ బెటాలియన్ సిబ్బంది. ఆమెని అదుపులోకి తీసుకుని బ్యాగులు సోదాలు చేయడం అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది.

 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఘటన

Advertisement

ప్రస్తుతం ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తు్న్నారు. ఆ తర్వాత కృష్ణగంజ్‌ పోలీసులకు అప్పగించారు బీఎస్ఎఫ్ అధికారులు. సరిహద్దుల్లో జరిగిన అతిపెద్ద స్వాధీనాలలో ఒకటిగా నిలిచింది. పట్టుబడి బంగారం మూలాలపై ఫోకస్ చేశారు అధికారులు. సరిహద్దు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు చేపట్టారు. బంగారం సరిహద్దుకు ఎలా చేరింది? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఏ దేశం నుంచి ఎక్కడకు వెళ్తోంది? ఇందులో బంగారం వ్యాపారుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయాలను నిర్ధారించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడిన మహిళను బీఎస్ఎఫ్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడం, బంగారం మూలాలు ఎక్కడికి వెళ్లాలనేది తెలుసుకోవడంపై ఆరా తీస్తున్నారు.

ALSO READ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పని చేస్తున్న ఓ పెద్ద స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ఆ మహిళకు సంబంధముందా? అనే కోణలో పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల పరిమాణం ఒక్క ప్రయత్నం కాకుండా విస్తృతమైన దందాగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలకాలంలో మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ ప్రయత్నాలను నిరోధించడానికి సరిహద్దు వెంబడి నిఘాను ముమ్మరం చేసింది బీఎస్ఎఫ్. ఈ క్రమంలో బంగారం దొరకడం అధికారులు షాకయ్యారు. ఇటీవల బంగారంపై కేంద్రం ట్యాక్స్ విధించడంపై మార్కెట్ వర్గాలు తప్పుబట్టాయి. పన్నుల కారణంగా బంగారం అక్రమ రవాణాకు దారితీయవచ్చని చెప్పుకొచ్చారు. వారి చెప్పినట్టే జరిగింది.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×