E-Paper
Advertisement

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!
Advertisement

SIM Card Supply: డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ లో ఉంటున్న ఉగ్ర హ్యాండ్లర్లకు సిమ్ కార్డులు సప్లై చేస్తున్న వ్యక్తిని రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సదరు నిందితుడు 8సిమ్ కార్డులను పాక్ కు చేరవేసినట్టుగా విచారణలో తేలింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా శ్రీ గంగానగర్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. కాగా, శ్రీ గంగానగర్ స్టేషన్ పరిధిలోని అనూప్ ఘడ్ లో నివాసం ఉంటున్న బల్వీందర్ సింగ్ అలియాస్ బింద్రా పాకిస్తాన్ లో ఉంటూ మన దేశంలో హింసను సృష్టించటానికి కుట్రలు చేస్తున్న కొందరికి డబ్బు తీసుకుంటూ సహకరిస్తున్నాడు.

డ్రోన్ ద్వారా..

ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న వారి పేర్లపై 8 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటిని డ్రోన్ ద్వారా పాక్ లోని హ్యాండ్లర్లకు అందచేశాడు. ఈ మేరకు పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బల్వీందర్ సింగ్ 8 సిమ్ కార్డులను సరిహద్దు అవతలి ఉన్న పాక్ హ్యాండ్లర్లకు అందజేసినట్లు విచారణలో తేలింది. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి పాక్ హ్యాండ్లర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసినట్టుగా తేలింది. వాటి ద్వారా దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్టుగా తెలిసింది.

Advertisement

Also read: నా దృష్టిలో RCB చాలా చెత్త టీమ్…వాళ్లు ఉగాండా కంటే దారుణం

డ్రగ్స్ కేసులో..

బల్వీందర్ సింగ్ గతంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా భారత్‌‌లోకి 55 కోట్ల విలువ చేసే 10.5 కిలోల హెరాయిన్‌ను రప్పించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. జైసల్మేర్ లో నమోదైన ఈ కేసులో అతనిపై 25వేల రూపాయల రివార్డును అధికారులు ప్రకటించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. పాక్ హ్యాండ్లర్లతో జరిపిన చాటింగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు, పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌ తో అతనికి ఉన్న ఉన్న లింకులపై దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Also read: ఫోక్ స్టార్ కిట్టు పవన్ మూవీ లాంచ్..కెమెరా స్విచ్ ఆన్ చేసి విషెస్ తెలిపిన బిగ్ టీవీ చైర్మన్!

Tags

Related News

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊహించని షాక్.. ఇంటికి భారీగా క్యాష్ ఆన్ డెలివరీలు.. దెబ్బకు ఊరు వదిలి జంప్!

‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!

Big Stories

Advertisement
×