E-Paper
Advertisement

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!
Advertisement

FSSAI Bans: భారతీయ వంటకాల్లో ఇంగువ (Hing)కి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించే ఈ సుగంధ ద్రవ్యం.. ఇప్పుడు ఆహార భద్రతా వర్గాల నిఘా నీడలోకి వచ్చింది. ప్రముఖ సుగంధ ద్రవ్యాల తయారీ సంస్థలైన ఎవరెస్ట్ (Everest Food Products), లాల్‌జీ గోధూ (Laljee Godhoo and Company) తయారు చేస్తున్న కాంపౌండెడ్ ఇంగువ ఉత్పత్తులు.. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకటించింది.

విక్రయాలపై నిషేధం

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం – 2006 కింద ఈ రెండు కంపెనీల ఇంగువ ఉత్పత్తులను బ్యాన్ చేస్తున్నట్లు ఆహార భద్రత నియంత్రణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేసిన కాంపౌండెడ్ ఇంగువ శాంపుల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలిందని అధికారులు తెలిపారు.

Advertisement

ల్యాబ్ పరీక్షల్లో ఏం తేలిందంటే?

ఎవరెస్ట్ సంస్థకు చెందిన కాంపౌండెడ్ ఇంగువ, ఎల్లో ఇంగువ పౌడర్, బ్లాక్ ఇంగువ పౌడర్ శాంపిల్స్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన ‘ఆల్కహాల్-సాల్యుబుల్ ఎక్స్‌ట్రాక్ట్’ (Alcohol soluble extract) శాతాన్ని కలిగి లేవని అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇందులో కనిష్టంగా 5 శాతం ఆల్కహాల్ సాల్యుబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండాలి. కానీ పరీక్షించిన ఒక శాంపిల్‌లో ఇది ‘సున్నా శాతం’ నమోదవ్వగా.. ఎల్లో ఇంగువ పౌడర్‌లో 3.29 శాతం, బ్లాక్ ఇంగువ పౌడర్‌లో 4.4 శాతం మాత్రమే నమోదైనట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నివేదిక పేర్కొంది.

Advertisement

Also Read: మూడ్ వస్తే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి.. నైట్ క్లబ్స్, మెట్రో, ఎయిర్ పోర్ట్స్ ఎక్కడైనా మీ ఇష్టం!

ఇదే కంపెనీలపై గతంలోనూ వేటు

ఈ సంస్థలు నాణ్యతా లోపాలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిపిన తనిఖీల్లోనూ ఎవరెస్ట్ సంస్థకు చెందిన చికెన్ మసాలా, గరం మసాలా, ఎగ్ కర్రీ పౌడర్ వంటి ఉత్పత్తుల్లో లేబులింగ్ ప్రకటనలు, నాణ్యతా ప్రమాణాల విషయంలో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు ఫుడ్ రెగ్యులేటర్ గుర్తుచేసింది. తాజా చర్యలతో ఆహార ఉత్పత్తుల నాణ్యతపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×