E-Paper
Advertisement

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి
Advertisement

Tech Jobs Decline| భారత్‌లో ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. టెక్నాలజీ రంగంలో నియామకాలు మందగిస్తుండగా, ఇతర రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి.
ముఖ్యంగా హెల్ల్ కేర్, మెడికల్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. అదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు కేవలం టెక్ ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. ప్రముఖ ఉద్యోగ పోర్టల్ ఇండీడ్ (Indeed) విడుదల చేసిన తాజా అధ్యయనంలో భారత ఉద్యోగ మార్కెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

మళ్లీ పుంజుకుంటున్న భారత్‌లో ఉద్యోగ నియామకాలు

ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారత ఉద్యోగ మార్కెట్ మూడు నెలల మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే జూలైలో ఉద్యోగ ప్రకటనలు 1.2 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగ ప్రకటనలు 8.3 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశంలో నియామక కార్యకలాపాలు మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అయితే అన్ని రంగాల్లో ఒకే విధమైన వృద్ధి కనిపించడం లేదు. కొన్ని రంగాల్లో నియామకాలు వేగంగా పెరుగుతుండగా, టెక్ ఉద్యోగాల్లో మాత్రం మందగమనం కొనసాగుతోంది.

ఆరోగ్య రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది

Advertisement

ఆరోగ్య సంరక్షణ రంగం నియామకాల విషయంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల ప్రకటనలు 30 శాతం పెరిగాయి. ఫిజీషియన్లు, సర్జన్లకు సంబంధించిన ఉద్యోగాలు 26 శాతం పెరిగాయి. చైల్డ్‌కేర్ ఉద్యోగాలు కూడా 26 శాతం వృద్ధిని నమోదు చేశాయి. థెరపీకి సంబంధించిన ఉద్యోగాల ప్రకటనలు 25 శాతం పెరిగాయి. ఈ గణాంకాలు హెల్త్ కేర్ రంగాల్లో నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తున్నాయి.

టెక్ ఉద్యోగాల నియామకాలు ఎందుకు మందగిస్తున్నాయి?

టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నియామకాలు పూర్తిగా కుప్పకూలలేదు. అయితే కొన్ని కీలక విభాగాల్లో నియామకాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషన్స్, సపోర్ట్ ఉద్యోగాలు 24 శాతం తగ్గాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాల ప్రకటనలు 18 శాతం తగ్గాయి. డేటా, అనలిటిక్స్ ఉద్యోగాలు 14 శాతం తగ్గాయి. ఐటి సిస్టమ్స్, సొల్యూషన్స్ ఉద్యోగాలు 11 శాతం తగ్గాయి. దీంతో టెక్నాలజీ రంగం.. ప్రస్తుతం ఉద్యోగ వృద్ధికి ప్రధాన డ్రైవర్‌గా కనిపించడం లేదు.

టెక్ రంగం వెలుపల కూడా AI నైపుణ్యాలు అవసరం

Advertisement

ఈ అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏఐ నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యత. ఇండీడ్ రిపోర్ట్ ప్రకారం.. 349 ఉద్యోగ హోదాల్లో ఏఐ నైపుణ్యాలకు సంబంధించిన ప్రస్తావనలు కనిపించాయి. ఇవి కంపెనీ పరిశీలించిన మొత్తం ఉద్యోగాల్లో సుమారు 6.6 శాతంగా ఉన్నాయి. ఈ సంఖ్య గత ఏడాదితో పోలిస్తే రెండింతలైంది. రెండేళ్ల క్రితం నమోదైన స్థాయితో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.

నాన్ – టెక్ ఉద్యోగాల్లోనూ ఏఐ కీలకం

ఏఐ అవసరాలు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే పరిమితం కావడం లేదు. ఏఐ సంబంధిత ఉద్యోగ పోస్టింగ్‌లలో 42 శాతం నాన్ టెక్ విభాగాలకు చెందినవే ఉన్నాయి. గత ఏడాది ఈ వాటా 39 శాతంగా ఉంది. రెండేళ్ల క్రితం ఇది కేవలం 29 శాతంగా ఉండేది.
మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కూడా ఏఐ పరిజ్ఞానం ఉపయోగకరంగా మారుతోంది. ఏఐ సాధనాలు ఉత్పాదకత, పరిశోధన, నిర్ణయాలు, రోజువారీ పనులను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి.

Also Read: లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న టెకీలు.. ఏఐ, రోబోలపై పన్నులు విధించాలి?

ఉద్యోగార్థులపై ఈ మార్పుల ప్రభావం

టెక్నాలజీ అనుభవం ఇప్పటికీ విలువైనదే. అయితే AI టూల్స్ ఉపయోగించడం నేర్చుకోవడం ఉద్యోగార్థులకు అదనపు ప్రయోజనం ఉంటుంది. నాన్ – టెక్ రంగాల్లో పనిచేసేవారు కూడా తమ వృత్తికి అనుగుణంగా ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు.
భారత్‌లో ఉద్యోగ మార్కెట్ కేవలం మందగించడం లేదు. అది తన ప్రాధాన్యతలను మార్చుకుంటోంది. ఈ మార్పులో ఏఐ నైపుణ్యాలు వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Also Read: చదువు, క్రమశిక్షణ, ప్రవర్తనలో నెంబర్ 1.. పిల్లల్ని ప్రయోజకులుగా పెంచే జపాన్ పేరెంటింగ్ టిప్స్

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×